ఎక్కడైనా సరే.. ఎప్పుడైనా సరే..! ప్లేస్ నువ్వే డిసైడ్ చేయ్..!! ఒంటిరిగా వస్తా..! సింగిల్ హ్యాండ్.. గణేశ్..!! ఇదేదో సినిమా డైలాగ్ అనుకునేరు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే, బిగాల గణేశ్ గుప్తా సవాల్ ఇది. బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్‌పై బిగాల ఇలా సవాల్ విసిరారు. డెవలప్‌మెంట్‌పై ఏమేమీ చేశానో వివరించేందుకు నేను రెడీ.. కావాలంటే నువ్వు ప్రిపేర్ కా.. డిపార్టుమెంటుల వారీగా వివరాలు సేకరించు.. నిజనిజాలు తెలుసుకో.. ఒక డేట్ , ప్లేస్ ఫిక్స్ చేసుకో.. కెమరాల మధ్య మనిద్దరం చర్చించుకుందా.. అర్బన్ ప్రజలంతా చూస్తారు… అంటూ బిగాల సవాల్ విసరడంతో అర్బన్ రాజకీయాలు వేడెక్కాయి. దీనికి ప్రతి సవాలు విసిరేందుకు ధన్‌పాల్ సిద్దపడ్డా… ఆరోపణలకే పరిమతమయ్యాడు.
కొంత వెనకడుగు వేశాడు. డెవలప్‌మెంట్‌పై కాకుండా నువ్వు ఎక్కడెక్కడ కబ్జాలు చేశావో చెబురా.. రా .. అంటూ కవ్వింపు చర్యలకు దిగాడు. డేట్ ఫిక్స్ చేశాడు. సోమవారం 13 తారీఖు.. కానీ ప్లేస్ డిసైడ్ చేయలేదు. నువ్వే డిసైడ్ చేసుకో అంటూ కొండంత రాగం తీసి… అన్నట్టుగా తుస్సుమనిపించాడు ధన్‌పాల్. డేట్ ఫిక్స్ చేసినోడు.. ప్లేస్ టైమ్ ఫిక్స్ చేసి రా.. అని పిలిస్తే కొంచెం పొలిటికల్ మైలేజీ వచ్చేది. కానీ అంతా ఆరోపణలకే పరిమతమయ్యాడు. డెవలప్‌మెంట్‌పై ఏమీ మాట్లాడలేదు. ప్లేస్ కంటేశ్వర్ అంటున్నాడు… డబుల్ బెడ్ రూం ఇంట్లు అంటున్నాడు.. ఇంకా ఏదేదో అంటున్నాడు .. తప్ప ఇతమిత్థంగా ఇక్కడికి రా అని ప్రతి సివాల్ విసిరితే దాంట్లో దమ్ముండేది. పస ఉండేది. అదేమీ చేయకుండా.. నువ్వు భూములు కబ్జా చేశారు. దోచుకున్నావు.. నేను ప్రజా సేవ చేస్తున్నాను అంటూ టాపిక్ డైవర్ట్ చేశాడు ధన్‌పాల్. ఇలా సాగుతున్నది అర్బన్ రాజకీయం..