ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే కాదు..పక్కనున్న జగిత్యాల జిల్లాలో కూడా బీసీలకు ఒక్కటంటే ఒక్క సీటు ఇవ్వలేదు కాంగ్రెస్. ‘వాస్తవం’ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ‘ బీసీలకు రాజకీయ ఘోరీ’ అని కూడా వార్తకథనం రాసింది. విచిత్రమేమిటంటే బీసీలకు రాజకీయంగా కాంగ్రెస్ కట్టిన సమాధి పైనే ‘బీసీ డిక్లరేషన్’ అనే భారీ సభ పెట్టింది కాంగ్రెస్. అదీ నరనరాన రెడ్డి కులాన్ని పులుముకుని.. రెడ్ల ఆధిపత్యం కోసం, రెడ్ల రాజ్యం కోసం కలలు కుంటున్న రేవంత్‌రె్డ్డి గెలుపు కోసం.
కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. స్వపక్షంలోనే బీసీ నేతలు దుమ్మెత్తిపోశారు. కొందరైతే దీనికి అడ్డుపడ్డారు. ‘పోయి ఏడనన్న పెట్టుకోర్రి.. మీకు ఈడనే దొరికిందా బీసీ డిక్లరేషన్ కోసం.. ఒక్క సీటు ఇవ్వని చోట.. ఇజ్జత్ పోతది.. నవ్వుల పాలైతం..’ అని చెప్పినా వినలే. నవ్విపోదురు గాక నాకేమిటీ అన్న చందంగా రేవంత్‌రెడ్డిని గెలిపించుకోవాలని పిలుపునిస్తూ బీసీలకు ఇది చేస్తాం.. అది చేస్తాం.. అని ఏవో మాటలు చెప్పి దానికి బీసీ డిక్లరేషన్ అనే పేరు పెట్టి అలా ముగించేశారు.
ఓ వైపు కేసీఆర్ అదే గడ్డపై రేవంత్‌ను ‘ నోట్ల కట్టలతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దొంగ’ అని ‘నువ్వు నాపై పోటీనా..?’ అంటూ వెటకారం చేసి బట్టలూడదీసినంత పనిచేసి పోయిన తరువాత రోజే అదే గడ్డపై మరింత నవ్వుల పాలయ్యాడు రేవంత్. ఆ పార్టీ అధిష్టానం.