ముచ్చటగా మూడు జిల్లాలు. మచ్చుకైనా ఒక్కరంటే ఒక్క బీసీ క్యాండిడేట్‌ లేడు. ఈ మూడు జిల్లాల్లో బీసీలకు రాజకీయంగా ఘోరీ కట్టేసింది కాంగ్రెస్‌ పార్టీ. నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో ఒక్కరికీ బీసీలకు చాన్స్‌ ఇవ్వలేదు పార్టీ. రాజకీయంగా వారికి ఎలాంటి సపోర్టును ఇవ్వకపోగా… చివర వరకు మాత్రం బాగా ఆశలు రేపి.. టికెట్లను ఆపీ ఆపీ చివరకు అగ్రవర్ణాలకే కట్టబెట్టింది అన్ని సీట్లు.. ఈ మూడు జిల్లాల్లో మొత్తం 9 మంది అగ్రవర్ణాలకు టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ.

ఒక్క బీసీ కూడా ఇందులో లేడు. కనీసం నిజామాబాద్‌ అర్బన్‌లోనైనా బీసీలకే టికెట్ దక్కుతుందని అంతా భావించారు. ధర్మపురి సంజయ్‌, ఆకుల లలిత, కేశవేణు, మహేశ్ కుమార్‌ గౌడ్‌ తదితరులు పోటీ పడ్డారు. వీరికి మొండి చేయి చూపింది. ఆర్మూర్‌ కూడా బీసీకే అన్నారు. గోర్త రాజేదర్‌ చేతి చమురు వదిలించుకున్నాడు ప్రచారానికి. కానీ చివరకు వినయ్‌రెడ్డికే టికెట్ ఇచ్చింది అధిష్టానం. బాన్సువాడలో కాసుల బాలరాజుకు ఇక చాలు ఇంట్లో కూర్చోమంది. ఈరవత్రి అనిల్ కూడా బాల్కొండ, ఆర్మూర్, అర్బన్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డాడు. బీఆరెస్‌ నిజామాబాద్‌ రూరల్ నుంచి, ఎల్లారెడ్డి నుంచి ఇద్దరు బీసీలకు ఇచ్చింది. బీజేపీ ఓ మూడు సీట్లు కేటాయించింది. కానీ కాంగ్రెస్‌ మాత్రం రాజకీయంగా తమ పార్టీలకు బీసీలకు స్థానం లేదని చెప్పేసింది. మీరంతా పల్లకి మోయండి.. మేము ఊరేగుతామని అగ్రవర్ణాలకే మళ్లీ చాన్స్ ఇచ్చింది. ఇదీ కాంగ్రెస్‌ బీసీ కొంగజపం పరిస్థితి.

 

 

You missed