మొన్నటి దాకా కత్తులు దూసుకన్న నేతలంతా ఒక్కటయ్యారు. నీదో గ్రూపు నాదో గ్రూపు అంటూ తన్నుకునేందుకు కూడా వెనకాడని నేతలంతా మనం మనం దోస్తులమని కలిసిపోయారు. కారణమేమంటారా..? నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గం నుంచి షబ్బీర్ అలీ పోటీ చేయడమే. నీకా టికెట్‌ నాకా అంటూ ఢిల్లీ లెవల్లో ఒకరికి మించి మరొకరు పోటీలు పడ్డారు. లాబీయింగ్‌ చేశారు. చివర వరకు ప్రయత్నాలు చేశారు. కానీ అధిష్టానం .. అక్కడ కామారెడ్డిలో సీఎం పోటీ నేపథ్యంలో షబ్బీర్‌ను తప్పని సరి పరిస్థితుల్లో నిజామాబాద్‌ అర్బన్‌కు పంపింది.

కామారెడ్డిలో రేవంత్‌ను నిలిపింది. దీంతో షబ్బీర్‌ రాక సందర్బంగా అసంతృప్తి నేతలు గ్రూపులు నడిపిన నాయకులంతా ఒక్కటయ్యారు. షబ్బీర్‌ను గెలిపించుకోవడమే ధ్యేయంగా పనిచేసేందుకు రెడీ అయ్యారు. మొన్నటి వరకు ఆకలి మీదున్న అర్బన్‌ నేతలకు కావాల్సింత మేత కూడా దొరకనుంది. దీంతో ఎవరికి అప్పగించిన బాధ్యతల్లో వారు బిజీబిజీ కానున్నారు. మంగళవారం షబ్బీర్‌ తొలిసారిగా నిజామాబాద్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ సందర్బంగా భారీ ర్యాలీకి ప్లాన్‌ చేశారు.

ఈనెల 9న నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే షబ్బీర్‌ తన ఫామ్‌ హౌజ్‌లో అర్బన్‌ నేతలందరితో భేటీ అయ్యారు. దిశానిర్ధేశం చేశారు. అటు మైనార్టీ ఓట్లతో పాటు మున్నూరుకాపు ఓట్లపై కాంగ్రెస్‌ ప్రధానంగా గాలం వేసింది. షబ్బీర్‌ ఎంట్రీతో ఇప్పుడు అర్బన్‌లో సీన్‌ మారింది. కాంగ్రెస్‌ నేతల దశా మారనుంది.

You missed