కామారెడ్డి నుంచి ఇక్కడ నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి పోటీలోకి దిగిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత షబ్బీర్‌కు సంజయ్‌ ఝలక్‌ ఇచ్చాడు. సంజయ్‌ అర్బన్‌ నుంచి టికెట్ కోరాడు. చాలా ప్రయత్నాలే చేశాడు. కానీ అది వరించలేదు. కామారెడ్డి నుంచి సీఎం పోటీలో ఉండటంతో షబ్బీర్‌కు అనివార్యంగా అర్బన్‌ ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో సంజయ్‌ కూడా డిసైడ్‌ అయ్యాడు. షబ్బీర్‌ గెలుపు కోసం తన శాయశక్తులా ప్రయత్నం చేయాలని, శక్తి వంచన లేకుండా కృషి చేయాలని. వాస్తవానికి సంజయ్‌కు మున్నూరుకాపులతో పాటు మైనార్టీలలో కొంత పట్టుంది.

షబ్బీర్‌కు ఇది ఉపయోగం కూడా. కానీ మంగళవారం ఆయన తొలిసారిగా జిల్లా కేంద్రానికి వచ్చి భారీ బైక్‌ ర్యాలీ తీశాడు. దీనికి సంజయ్‌ హాజరు కాలేదు. అంతా ఇదే చర్చ కొనసాగింది. సంజయ్‌ ఎందుకు వెళ్లలేదు అని. అసలు విషయం ఏమిటంటే ఎన్నికల వేళ అర్బన్‌లో ఏఐసీసీ పలువురికి పదవులు కట్టబెడుతున్నది. సంజయ్‌ కూడా తనకూ ఓ పదవి ఇస్తే మరింత బలంగా తన సామాజికవర్గంలోకి వెళ్లి ఓట్లు అడగవచ్చని, అర్బన్‌లో తనకున్న పట్టును మరింత బలంగా కాంగ్రెస్‌ పార్టీ, షబ్బీర్‌కు ఓట్లు పడేలా చేయొచ్చనే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.

మొత్తానికి తనకు పార్టీలో పార్టీ పదవి ద్వారా గుర్తింపు కావాలని కోరుకున్నాడు. తొలత అధిష్టానం సరే అన్నట్టే అని ఆ తర్వాత దీనిపై ఏమీ మాట్లడలేదు. షబ్బీర్‌ కూడా సంజయ్‌ సాయం కోరుతున్నాడు. పార్టీ పదవి విషయంలో మాత్రం నేనున్నానే భరోసాను ఇవ్వలేకపోయాడు. దీంతో ఇప్పుడే పార్టీ పట్టించుకోవడం లేదు.. ఇక గెలిచిన తరువాత పరిస్థితి ఎలా ఉంటుంది..? అనేది సంజయ్‌, అతని అనుచరుల ఆలోచనగా ఉంది. అందుకే గుర్తింపు ఇవ్వకుండా తను రిస్క్‌ తీసుకొని తిరిగి షబ్బీర్‌ గెలుపు కోసం చమటోడ్చడం అవసరమా..? అనే పరిస్థితికి వచ్చాడు సంజయ్‌. ఇక్కడ అర్బన్‌ కాంగ్రెస్‌ లో మళ్లీ ఇలా మొదలైంది షబ్బీర్‌కు ఆదిలో హంసపాదులా..

You missed