అప్పటి వరకు ఆ ముగ్గురు నలుగురిదే పెత్తనం. అంతా మేమే.. అంతా మాకే అనే రీతిలో కామారెడ్డి బీఆరెస్‌ను ఆగం పట్టించేశారు. తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారు. స్వపక్షంలోనే కత్తులు దూసుకునే పరిస్థితి. ఇప్పుడక్కడ సీఎం వచ్చినా పరిస్థితి మారలేదు. నాయకులు తమ తీరు మార్చుకుని అందరినీ కలుపుకుని పోయే మనస్తత్వం అలవర్చుకోలేదు. ఒకటికి రెండు సార్లు బుజ్జగించినా, వార్నింగ్‌ ఇచ్చినా తీరు మారలేదు.

పరిస్థితుల్లో మార్పు రాలేదు. మొన్న ప్రగతి భవన్‌కు పిలుపించుకున్నాడు కేటీఆర్‌. అక్కడ విభేదాలు భగ్గుమన్నారు. గ్రూపుల లొల్లి బయటపడ్డది. ఇక లాభం లేదనుకున్నాడు కేటీఆర్‌. అసంతృప్త నేతలకు, గుర్తింపు లేని నేతలకు అంతా తానై ఉంటాననే భరోసా ఇవ్వాలనుకున్నాడు. ‘నేనున్నాన’ంటూ ముందుకు వస్తున్నాడు. ఈ దసరా తర్వాత రెండ్రోజులు కామారెడ్డిలో టూర్‌ పెట్టుకున్నాడు. ఈనెల 25,26 తేదీల్లో కామారెడ్డిలో సభలు, సమావేశాలు నిర్వహించనున్నారు. మండలాలకు చెందిన ప్రతీ నేతతో భేటీ అయ్యి వారికి నేనున్నానే భరోసా ఇచ్చి.. అంతా కలిసికట్టుగా పనిచేసేలా కార్యోన్ముఖుల్ని చేయనున్నారు కేటీఆర్‌.

ఇప్పటి దాకా మాదే పెత్తనం అని అంతా నాశనం చేసిన నేతలకు ఇదో చెంపపెట్టు, గుణపాఠం లాంటి ప్రతిచర్యలా కేటీఆర్‌ వ్యవహరించనున్నారు. కామారెడ్డిలో మొత్తం ఆగమైన వ్యవస్థను మళ్లీ జీరో నుంచి చక్కదిద్దే పనిని నెత్తుకెత్తుకున్నాడు కేటీఆర్‌. కామారెడ్డికి ఫౌండేషన్‌ కమిటీ వేశాడు. ఇందులో ఉద్యమకారులు లోకల్‌ లీడర్లు అంతా ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. ఏమి చేయాలన్నా ఈ కమిటీ కీలకం. ఏ ఒక్కరి నిర్ణయమో శిరోధార్యం ఇక కాదు. అలా ప్లాన్ చేశాడు కేటీఆర్‌. దీంతో పాటు మండలాల వారీగా సమన్వయ కమిటీలు వేయాలని ఆదేశించాడు.

 

 

You missed