బీజేజీ మొదటి లిస్టు శనివారం విడుదల కావాల్సింది. అనేక ట్విస్టుల మధ్య ఆగిపోయింది. ఇందూరు నుంచి ఆర్మూర్, అర్బన్, బాల్కొండ, రూరల్ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు ఖరారు చేసి జాబితా విడుదల చేస్తారని అనుకున్నారు. అదే విధంగా సర్వం సిద్దం అయ్యింది కూడా. కానీ చివరి నిమిషయంలో రూరల్ నుంచి బీజేపీ సీనియర్ నేత యెండల లక్ష్మీనారాయణ పేరు తెరపైకి రావడంతో మొత్తం ఇందూరు లిస్టుకే బ్రేక్ పడింది. అర్వింద్ టీమ్‌లో అందరికీ టికెట్లు వస్తాయనుకుంటే రూరల్ ఎంపీకి పంటికింద రాయిలా మారింది. అర్బన్ నుంచి ధన్‌పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ నుంచి పైడి రాకేశ్‌రెడ్డి, బాల్కొండ నుంచి అన్నపూర్ణమ్మ పేర్లు ఖరారయ్యాయి.
వీరికి అధిష్టానం నుంచి ఫోన్లు కూడా వచ్చాయి. శుభాకాంక్షలు తెలుపుతూనే .. ప్రచారం కూడా మొదలు పెట్టాలని సూచించారు. రూరల్ నుంచి ధన్‌పాల్‌కు ఫోన్ రాలేదు. దీంతో అలజడి మొదలయ్యింది. అర్వింద్ ఆది నుంచి యెండలను, యెండల వర్గాన్ని తొక్కిపెడుతున్నాడు. ఈ క్రమంలో యెండలకు ఒకవేళ టికెట్ ఇస్తే బాన్సువాడకు పంపాలని అర్వింద్ అధిష్టానానికి సూచించాడు. కానీ అధిష్టానం యెండలను రూరల్‌కు సరిపోతాడని భావిస్తున్నారు. దీంతో అర్వింద్‌కు ఇది శరాఘాతంగా మారింది. ఈ పరిణమాలు మొదటి లిస్టులో ఇందూరు పేర్లే అధికారికంగా అనౌన్స్ చేయకుండా ఆపేసే పరిస్థితికి వచ్చాయి. అర్వింద్ మాత్రం కులాచారి దినేశ్‌కు కచ్చితంగా నీకే టికెట్ వస్తుందని చెబుతున్నాడట.