ధర్మపురి సంజయ్‌ తన టీమ్‌ను రంగంలోకి దింపాడు. నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి తనకు టికెట్‌ ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచుతున్నాడు. పరోక్షంగా తన కులబలాన్ని రంగంలోకి దింపాడు. తన చిననాన, జిల్లా మున్నూరుకాపు ట్రెజరర్‌ ధర్మపురి సురేందర్‌తో ఇవాళ ప్రెస్‌మీట్‌ పెట్టించాడు. ఇక్కడ పార్టీల ప్రస్తావన తీయకున్నా.. ఏ పార్టీ అయినా సరే జిల్లాలో రెండు సీట్లు మున్నూరుకాపులకు ఇవ్వాలని లేదంటే ఓడగొట్టేస్తామని ఆల్టిమేటం జారీ చేశాడు సురేందర్‌. ఇప్పటికే బీఆరెస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా పేరు డిక్లేర్‌ అయ్యింది. ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక మిగిలింది కాంగ్రెస్‌, బీజేపీ. కాంగ్రెస్‌ నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలో రెండు బీసీలకు ఇవ్వాలని భావించింది. నిజామాబాద్‌ అర్బన్‌, ఆర్మూర్‌ నియోజకవర్గాలు ఇద్దామనుకున్నది. కానీ ఆర్మూర్‌ సాధ్యమయ్యేలా లేదు.

కనీసం అర్బన్‌ అయినా బీసీకి ఇద్దామనుకున్నది. ఇక్కడ మున్నూరుకాపుల డామినేషన్‌ ఎక్కువ. ఈసారి ఆకులం చాలా కసిగా ఉంది. తమవాళ్లకు టికెట్‌ ఇస్తే గెలిపించుకుందామని. ధర్మపురి సంజయ్‌ అర్బన్‌పై సీరియస్‌గా నజర్‌ పెట్టాడు. డీఎస్‌కు ఉన్న పరపతిని ఉపయోగించుకుని ఎలాగైనా టికెట్‌ సాధిద్దామని ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తీవ్రంగా అడ్డుకుంటున్నాడు. ఈక్రమంలో ఆకుల లలిత పేరు తెరపైకి వచ్చింది. దీంతో సంజయ్‌ తన చిననానను రంగంలోకి దింపాడు. తండ్రి డీఎస్‌ ఆదేశాల మేరకు మున్నూరుకాపుకు టికెట్ ఇవ్వాల్సిందేనని ప్రెస్‌మీట్‌లో ఆల్టిమేటం జారీ చేశాడు. లేదంటే ఓడగొట్టేస్తామని కూడా వార్నింగ్‌ ఇచ్చేశాడు. బీజేపీ కచ్చితంగా ధన్‌పాల్‌ సూర్యనారాయణకు టికెట్‌ కన్‌ఫాం చేసేసింది. దీంతో ఎలాగూ సంజయ్‌ కాంగ్రెస్‌పై నమ్మకం పెట్టుకున్నాడు కాబట్టి చివరి ప్రయత్నం కులం అస్త్రాన్ని ప్రయోగించాడు సంజయ్. మేమంతా తీర్మానం చేశామని కూడా సురేందర్‌ ప్రెస్‌మీట్‌లో తీర్మానం కాపీలను ప్రవేశపెట్టడం గమనార్హం.

You missed