టికెట్ ఇస్తారా.. చస్తారా.. కాంగ్రెస్‌కు మున్నూరుకాపుల అల్టిమేటం….. ధర్మపురి సంజయ్‌కు అర్బన్ టికెట్ కేటాయించాలని పరోక్ష తీర్మానం.. డీఎస్ పేరు చెప్పాడని అతని సోదరుడు సరేందర్ ప్రెస్‌మీట్.. నిజామాబాద్‌లో రెండు సీట్లు ఇవ్వాలని డిమాండ్… పార్టీలకు అతీతంగా గెలిపిస్తామంటూనే.. కాంగ్రెస్ టార్గెట్‌గా.. సంజయ్‌కు ఇవ్వాల్సిందిగా పరోక్ష ఒత్తిడి… ఆకుల లలిత పేరు తెరపైకి రావడంతో ముందస్తుగా సంజయ్ టీమ్ అప్రమత్తం..
ధర్మపురి సంజయ్ తన టీమ్‌ను రంగంలోకి దింపాడు. నిజామాబాద్ అర్బన్ నుంచి తనకు టికెట్ ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచుతున్నాడు. పరోక్షంగా తన కులబలాన్ని రంగంలోకి దింపాడు. తన చిననాన, జిల్లా మున్నూరుకాపు ట్రెజరర్ ధర్మపురి సురేందర్‌తో ఇవాళ ప్రెస్‌మీట్ పెట్టించాడు.…