రైతులు దశాబ్దాలుగా పసుపు బోర్డును డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా దేశంలో ఉత్పత్తి అయ్యే పసుపులో 30 నుంచి 40 శాతం పసుపును అందిస్తున్న నిజామాబాద్ జిల్లా రైతులు, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల రైతులతో కలిసి తమకు పసుపు బోర్డు కావాలని పోరాటాలు చేస్తూ వస్తున్నారు. కానీ వారికి ఇప్పటి వరకు బెంజ్ కార్ లాంటి బోర్డు, ఇంకేవేవో బోర్డులు వచ్చాయి తప్ప పసుపు బోర్డు మాత్రం రాలేదని.. చివరికి ఎన్నికల బోర్డు వచ్చిందని ఘాటు విమర్శనాత్మక విశ్లేషణలు తాజాగా కొనసాగుతున్నాయి.

మొదట్లో లాభసాటి పంటగా కొనసాగిన పసుపు సాగు క్రమేనా నష్టాల సాగుగా మారిపోయింది. ఇందుకు పలు కారణాలు ఉన్న రాజకీయ కారణాలే ఎక్కువ అని చెప్పక తప్పదు. లాభసాటిగా జరుగుతున్న పసుపు సాగుపై వ్యాపారులు సిండికేట్ కన్ను తెరవడంతో పసుపు రైతులకు లాభాలు తగ్గడం మొదలైంది. వ్యాపారుల సిండికేట్ ను ఆదిలోనే అరికట్టడంలో పాలకులు విఫలం కావడంతో పసుపు సాగు నష్టాల దిశ పట్టింది. పసుపునకు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేసి దానిని నిజామాబాదులో ఏర్పాటు చేయాలని, దీంతో తమ నష్టాలు దూరమవుతాయని రైతులు పోరాడుతూ వచ్చారు. రైతుల పోరాటాన్ని తమకు ఓట్లు కురిపించే అస్త్రంగా రాజకీయ పక్షాలు మలుచుకుంటూ వచ్చాయి.

పసుపు బోర్డు ఇవ్వడం కేంద్రం చేతిలో ఉంటుంది. అప్పటికే బోర్డు ఇస్తామని హామీలు ఇస్తూ వచ్చిన జాతీయ రాజకీయ పార్టీలు విఫలమవడంతో ప్రాంతీయ పార్టీలు రైతుల పక్షాన జాతీయ పార్టీలపై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టాయి. ఇలా జాతీయ పార్టీలపై పసుపు బోర్డు కోసం ఒత్తిడి చేస్తూ అన్ని ప్రయత్నాలను తానుగా సైతం చేసిన పార్టీగా టిఆర్ఎస్ పార్టీని కాదనలేము. రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ పార్టీ పసుపు బోర్డును ఇవ్వలేకపోయింది. కేంద్రంలో ఐదు సంవత్సరాల తొలి దఫా అధికార సమయంలోను బిజెపి పార్టీ టిఆర్ఎస్ నుంచి, రైతులు, రైతు సంఘాలు, పసుపు బోర్డు సాధన కమిటీలు, వామపక్షం పార్టీలు పోరాట రూపాల్లో, సంప్రదింపుల రూపాల్లో, వివిధ పద్ధతుల్లో ఎంత పోరాడిన, ఎంతగా ఒత్తిడి తెచ్చిన బిజెపి ప్రభుత్వం పసుపు బోర్డును ఇవ్వలేదు.

టిఆర్ఎస్ పార్టీ తరఫున పసుపు రైతుల కోసం పసుపు బోర్డు సాధనలో పార్లమెంటు సభ్యురాలిగా కల్వకుంట్ల కవిత రైతులు మెచ్చుకునే స్థాయిలో బిజెపిపై ఇక పసుపు బోర్డు ఇవ్వాల్సిందే అనే తీవ్ర స్థాయిలో పోరాడారు. రైతులతో, పసుపు సాగు ప్రాంత ఎమ్మెల్యే లతో కలిసి ప్రధానమంత్రి మోడీకి విన్నవించడం, పసుపు సాగు చేసే రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేత పసుపు బోర్డు ఇవ్వాలని లేఖలు సాధించి బిజెపి ప్రభుత్వానికి సమర్పించడం.. చివరికి లోక్సభలో పసుపు బోర్డుపై ప్రైవేటు బిల్లు పెట్టి మరి పోరాడారు కవిత. అయినా సరే కేంద్ర ప్రభుత్వం బోర్డు ఇవ్వలేదు. అసలు పసుపు బోర్డు ఇవ్వడం సాధ్యమే కాదంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కుండ బద్దలు కొట్టినట్టుగా ప్రకటించడంతో రైతులు తీవ్ర నైరాశ్యంలో పడిపోయారు. ఈ క్రమంలో గత లోక్‌ సభ ఎన్నికల్లో తనని గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ పై రాసి ఇచ్చి మరి హామీ ఇచ్చారు. కల్వకుంట్ల కవిత కేంద్రం దిగివచ్చి పసుపు బోర్డు ఇవ్వదగ్గ పోరాటం చేసినా .. క్రెడిట్ టిఆర్ఎస్ కు పోకూడదని ఉద్దేశంతో పసుపు బోర్డు ఇవ్వలేదని.. బిజెపి అభ్యర్థిగా పోటీలో ఉన్న ధర్మపురి అరవింద్ గెలిపించుకుంటే కేంద్రం పసుపు బోర్డు ఇస్తుందన్న ఆశతో అరవింద్ ను గెలిపించారు.

అరవింద్ గెలిచాక మూడు నాలుగు సంవత్సరాలు గడిచిన పసుపు బోర్డు రాకపోవడంతో అరవింద్ ను నిలదీసిన సందర్భాల్లో రైతులు, పసుపు బోర్డు సాధన కమిటీ నేతలు కవిత చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. కవిత పోరాడలేదు అనే అభిప్రాయం రైతుల్లో ఎంత మాత్రం లేదని.. టిఆర్ఎస్‌కు పసుపు బోర్డు క్రెడిట్ పోకూడదని ఉద్దేశంతోనే బిజెపి బోర్డు ఇవ్వడం లేదని గ్రహించి ..బిజెపి అభ్యర్థి అయిన అరవిందును గెలిపించుకున్నారు.. కానీ అరవింద్ బోర్డు తేవడంలో విఫలమయ్యారు అని రైతులు, బోర్డు సాధన కమిటీ నాయకులు స్పష్టంగా చెప్పిన సందర్భాలు కవిత గానీ, టిఆర్ఎస్ పార్టీ గానీ బోర్డు కోసం రైతులు గుర్తుంచుకోదగ్గ ఒత్తిడిని కేంద్రంపై తెచ్చాయని చెప్పడానికి నిదర్శనం. ఈ పరిణామాల్లో అరవింద్ బోర్డు ఎప్పుడో తెచ్చానని, అది రైతులు అడిగిన అంబాసిడర్ కారు లాంటి బోర్డు కాకుండా లేటెస్ట్ బెంజ్ కార్ లాంటి బోర్డును తెచ్చానని చెప్పడం తమ డిమాండ్ ను తమ పోరాటాన్ని ఇది అవహేళన చేయడమే నన్న విమర్శలు సైతం వచ్చాయి.

ఇలా జాతీయ పార్టీలు పసుపు బోర్డు డిమాండ్ ను వారి ఓట్ల ప్రయోజనంగా మార్చుకుంటూ వస్తుంటే ధర రాక, ఉల్టా నష్టాలను భరిస్తూ వచ్చిన పసుపు రైతు అదే క్రమంలో పసుపు సాగును తగ్గించుకుంటూ వచ్చాడు. దాదాపు 18 శాతం సాగు విస్తీర్ణం ఈ కారణాల చేతనే 20 సంవత్సరాల కాలంలో తగ్గిపోయింది. మిగిలిన సాగు విస్తీర్ణం లో అరకొర లాభాల సాగు విస్తీర్ణం 40 శాతం ఉంటే 60 శాతం నష్టాల సాగే జరుగుతూ వస్తున్నదని రైతులే విశ్లేషిస్తున్నారు. ఇన్ని పరిణామాల, ఇన్ని రాజకీయ ప్రయోజనాల హామీల, ఇంత నష్టాల పసుపు సాగుల మధ్య పసుపు రైతు ఇక చేసేదేమీ లేదు అన్న నిరాశలో పడిపోయాడు. ఇటువంటి తరుణంలో రైతు ముందుకు ప్రధానమంత్రి ప్రకటన రూపంలో ‘ఎలక్షన్ బోర్డు’ వచ్చిందని విమర్శకులు పేర్కొంటున్నారు. ఎప్పుడో బోర్డు ఇచ్చేశాము దాని పేరు బెంజ్ కార్ లాంటి పసుపు బోర్డు అని నిలదీసిన వారి పై నల్లా ఎదురుదాడి చేసిన ఎంపీ అరవింద్, గత ఎన్నికల ముందు బాండ్ పేపర్.. ఇప్పుడు శాసనసభ ఎన్నికలకు ముందు ప్రధాని బ్రాండ్ ప్రకటన ఇందుకు కారణమని ఆ విశ్లేషణల సారాంశం.

You missed