నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా తన పంతాన్ని నెగ్గించుకున్నారు. తన అనుంగు అనుచరుడు, ఉద్యమకారుడు సత్యప్రకాశ్‌కు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఇప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు రెడీ అయ్యాయి. తమకు కావాలంటే తమకు కావాలని కులాల మధ్య కుమ్ములాటగా ఈ పదవి తయారయిన నేపథ్యంలో దీన్ని ఎన్నికల తర్వాతే ప్రకటించాలని భావించారు.
కానీ బిగాల దీనిపై పట్టుబట్టి మొత్తానికి సత్యప్రకాశ్‌కు ఏఎంసీ చైర్మన్ పదవిని ఇప్పించుకున్నాడు. ఉద్యమకారుడికి ఈ పదవి ఓ గౌరవకానుకగా ఇచ్చానని ఆయన పేర్కొంటున్నారు.