ఇందూరు రాజకీయాలు ఎప్పుడూ రాష్ట్ర వ్యాప్త చర్చలో భాగంగా ఉంటాయి. ఇప్పుడు బోధన్‌ వంతు వచ్చింది. షకీల్‌కు స్వపక్షం నుంచే అసమ్మతి సెగ తెగ తగులుతోంది. అది ఎంతలా అంటే షకీల్‌ ఓడించడయే ధ్యేయంగా పనిచేసే టీమ్‌ ఒకటి తయారయ్యంంది. ఆ టీమ్‌కు లీడర్‌ మున్సిపల్‌ చైర్ పర్సన్‌ భర్త, కౌన్సిలర్‌ తూము శరత్‌ రెడ్డి. ఇప్పుడు ఈ టీమ్‌ అంతా కాంగ్రెస్‌ గూటికి చేరనుంది. మంతనాలు జరుగుతున్నాయి. చర్చలు ముగిశాయి. ముహూర్తమే మిగిలుంది. ఇప్పుడు బోధన్‌లో ఇదో చర్చ. శరత్ రెడ్డి శపథం చేస్తున్నాడు. షకీల్‌ను ఓడించి తీరుతానని. ఎందుకు ఇంతలా గ్యాప్‌..? ఎందుకు ఇంతటి ఆగ్రహావేశాలు.. పంతాలు..? అసలు ఎవరు దీనికి కారణం..? అన్ని ప్రశ్నలకు ఒకటే సమాధానం. షకీల్‌. ఎస్‌… ఎమ్మెల్యే షకీల్‌. తన దుందుడుకు స్వభావంతో, తన వ్యవహార శైలితో తన కోసం ప్రాణాలు పెట్టి, త్యాగాలు చేసి గెలిపించుకున్న టీమ్‌ను కాలదన్నుతున్నాడు.

అవహేళన చేస్తన్నాడు. చాపలత్వం చూపుతన్నాడు. చంచలంగా మాట్లాడుతున్నాడు. ఇదీ ఈ చర్చకు, రాజకీయ శూన్యతకు, షకీల్‌ భవిష్యత్‌ ప్రశ్నార్థకానికి కారణం. తూము శరత్‌రెడ్డి తన టీమ్‌తో కలిసి త్వరలో కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. పదుల సంఖ్యలో కౌన్సిలర్లు.. ఇందులో ఎంఐఎం కూడా ఉంది. ఇదో విచిత్రం. ముస్లిం మైనార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉన్న చోట ఎంఐఎంతో కూడా దోస్తీ సరిగ్గా చేయలేకపోయాడు షకీల్‌. ఎంఐఎం కౌన్సిలర్లతో కలిసి త్వరలో శరత్‌ రెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరనున్నాడు. ఇంకా ఆశ్చర్యకర విషయం ఏమిటంటే…. ఇదంతా అధిష్టానానికి తెలుసు. రేపు నష్టం జరుగుతుందనీ తెలుసు. కానీ మధ్యవర్తిత్వం లేదు. కలిపే సయయం వారికి లేదు.

కలుపుకోవాలనే తత్వం షకీల్‌ దీ కాదు. నాలుగు నచ్చజెప్పే మాటలు చెబితే వినే మనస్తత్వం శరద్ అసలే కాదు. ఇదీ అసలు సమస్యకు కారణం. అందుకే బోధన్‌ రాజకీయం రసకందాయంలో పడింది. షకీల్‌ వ్యవహార శైలితో పార్టీ కి నష్టం కచ్చితంగా జరగనుంది. అది ఏ మేరకు..? శరత్‌ పంతం ఎవరి అంతానికి దారి తీస్తుంది..? కచ్చితంగా షకీల్‌కు. ప్రస్తుతం ఇదీ బోధన్‌లో నడుస్తున్న ట్రెండ్. అంతర్గతంగా కొనసాగుతున్న వార్‌. బయట ప్రపంచానికి తెలియని ‘వాస్తవం’. కానీ ఇదే నిజం. రేపు ఇది రచ్చకు దారి తీయనుంది. అంతకు ముందే అధికారి పార్టీ తేరుకుంటే మేలు. పంథా మార్చుకుంటే సబబు. మాకు తిరుగేలేదనే ధీమా ప్రదర్శిస్తే ఫలితం ఎలా ఉంటుందో రుచి చూడాల్సే ఉంటుంది.

You missed