మట్టి వినాయకులను పరిచయం చేసింది వారేనని చెప్పాలి. అతిశయోక్తిగా ఉందా..? కానీ ఇది నిజం. పద్నాలుగేళ్లుగా వీరు జిల్లాలో మట్టి వినాయకులను పంచుతున్నారు. పీవోపీ వినాయకులు, రంగు రంగుల వినాయకులను మత్రమే ఎంపిక చేసుకుని పూజలు చేసే సంస్కృతి పెరిగిపోతున్న క్రమంలో ఇది ఎంతగా పర్యవరణానికి ముప్పో ముందుగా తెలియజేసేందుకు.. తమ వంతుగా మట్టి వినాయకుల ద్వారా ప్రజలను జాగృతం చేసింది వీరే. ‘ హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ఫౌండేషన్‌’ ఈపేరు బహుశా ఎప్పుడో ఒకసారి ఏదో ఒక చోట వినే ఉంటారు. దీని వ్యవస్థాపక అధ్యక్షుడు రమణ్‌రెడ్డి. రెవ్యెన్యూ ఎంప్లాయిస్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ కు నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు కూడా.

రెవెన్యూ శాఖలో ఎంతో బిజీబిజీగా ఉన్నా.. ఓ వైపు పర్యావరణ పరిరక్షణ.. మరోవైపు సామాజిక సేవ, పేదలకు అండగా నిలిచేందుకు ఈ హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ఫౌండేషన్‌ వేదికగా తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. ఇవాళ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు చేతుల మీదుగా మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేశారు. గత పద్నాలుగేళ్లుగా ఈ కార్యక్రమాన్ని ఓ యజ్ఞంగా చేస్తున్నారు రమణ్‌రెడ్డి. అంతే కాదు తమ అసోసియేషన్‌ తరుపున పేద విద్యార్థులకు ఎంబీబీఎస్‌ పూర్తి చేసేందుకు ఆర్థికంగా ఇతోధికంగా సాయపడుతూ వారికి అండగా నిలుస్తున్నారు. రక్తదాన శిబిరాలు నిర్విహిస్తూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు రక్తదానం చేసేందుకు విరివిగా క్యాంపులు పెట్టి పలువురి చేత ప్రశంసలు అందుకుంటున్నారు. ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు.. అన్నట్టు ఒక్క అడుగుతో .. ఒక మంచి ఆలోచనతో ప్రారంభమైన ఈ మట్టి వినాయకుల వితరణ కార్యక్రమం ఇప్పుడు విస్తరించింది.

చాలా మంది ముందుకు వచ్చి తాము కూడా మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేయడం ప్రారంభించారు. రమణ్‌రెడ్డి, అతని సహచర రెవెన్యూ టీమ్‌ ఎంతో బిజీగా ఉన్న ఇలా సామాజిక సేవలో మమేకం కావడం పట్ల మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, స్థానిక ఎమ్మెల్యేలు వీరి కృషిని, అభిరుచిని అభినందిస్తున్నారు.

You missed