బాల్కొండ, వాస్తవం:

బాల్కొండ నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలను అందించే లక్ష్యంతో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తలపెట్టిన మెగా జాబ్ మేళా విజయవంతమైంది. ఈ జాబ్ మేళా మంత్రి ఆశించిన విధంగా తన నియోజకవర్గ యువతకు బహుళ ప్రయోజనాలను అందించిందని చెప్పవచ్చు. 70 కి పైగా కంపెనీలను తెచ్చి యువత ముందర ఉంచి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరుతూ వచ్చారు. 4000 మందికి పైగా యువతీ హాజరయ్యి మంత్రి అందిస్తున్న చేయూతను అందుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చాటారు.

ఈ ఉద్యోగాల కల్పన కార్యక్రమాన్ని ఇంతటితో ఆపకుండా ముందుకు తీసుకెళ్తానని తలపెట్టిన మంత్రికి యువత నుంచి లభించిన ఈ స్పందన మరింత ఉత్సాహాన్ని అందించడం ఖాయం. హాజరైన వారిలో పన్నెండు వందలకు పైగా మందికి ఉద్యోగాలు లభించడం మిగతా యువతలో స్ఫూర్తి కలిగించింది. జాబ్ మేళాలతో లో కలిగే ప్రయోజనాన్ని, ఏదేని ఉద్యోగం మొదలుపెట్టాల్సిన ప్రాముఖ్యతను.. తద్వారా లభించే ఎక్స్పీరియన్స్ వల్ల అందే చక్కని వేతనాల ఉద్యోగ అవకాశాలు గూర్చి యువకులు ఆలోచించేలా చేసింది. గతంలో ఇలా జాబ్ మేళాలు, మెగా జాబ్ మేళాలు తమ వద్దకే వచ్చి నిర్వహించిన సందర్భాలు ఉండేది కాదు. గ్రామీణ ప్రాంతాలు గల బాల్కొండ నియోజకవర్గం లాంటి చోట ఇలా చేయూతనిచ్చే జాబ్ మేళాలు ఇదివరకు జరగలేదు. మంత్రి నిర్వహించిన జాబ్ మేళాతో ఉపాధి అన్వేషణలో తమకు జాబ్ మేళాలు అంది వచ్చిన సువర్ణ అవకాశంగా వినియోగించుకోవాలని యువత మాట్లాడుకోవడం ఈ సందర్భంగా కనిపించింది.

ఇప్పటికే అర్బన్‌లో ఐటీ హబ్‌లో, నిజామాబాద్‌ రూరల్‌లో ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో నిర్వహించిన జాబ్‌మేళాలు సక్సెసయ్యాయి. ఇవి నిరంతర ప్రక్రియగా నేతలు ప్రకటించడం కూడా యూత్‌లో ఏదో ఒక సందర్భంలో వారి అర్హతను బట్టి కొలువు కచ్చితంగా కొట్టేసే చాన్స్‌ ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకప్పుడు దుబాయ్‌ దేశాలకు హైదరాబాద్‌లో ఇంటర్వూలు, రోజులు తరబడి పడిగాపులు, లక్షల్లో అప్పులు చేసి ఎడారి దేశాల్లో తిప్పలు పడి, కన్నవారిని, ఉన్న ఊరిని వదిలి పెట్టి ఎన్నో ఇబ్బందులకు గురయ్యేవారు. అప్పుల పాలయ్యేవారు. తనులువు చాలించేవారు. ఆ డెడ్‌బాడీ రావడానికీ రోజుల తరబడి హృదయం తడి నడుమ ఎదురుచూపులు.. ఇప్పుడు ఇనవ్నీ క్రమంగా దూరం కానున్నాయి. ఇదో మంచి శుభశకునం. శుభారంభం..

You missed