అధినేత కేసీఆర్, యువనేత కేటీఆర్ మార్గనిర్ధేశంలో, నాన్న గోవర్దన్ చూపిన బాటలో , పార్టీ శ్రేయస్సుకు, బలోపేతానికి కట్టుబడి ఉండి అహర్నిషలు ఓ కార్యకర్తలా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసుకుంటానని జిల్లా మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు, తైక్వాండో రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ఒలంపిక్ సంఘం ఉపాధ్యాక్షుడు, యువనేత బాజిరెడ్డి జగన్ అన్నారు. ఈమేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
తనకు రూరల్ నియోజకవర్గ టికెట్ ఇవ్వాలని ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు,నాయకులు కోరిన సందర్భాన్ని గుర్తు చేస్తూ వారందరి ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. సర్వదా వారి ప్రేమకు పాత్రుడనై ఉంటానని, రూరల్ నియోజకవర్గ ప్రజా సేవకే తన జీవితం అంకితం చేస్తానని ఆయన ప్రకటించారు. సీనియర్, మాస్ లీడర్‌గా పేరుగాంచిన తన తండ్రి గోవన్నకు మళ్లీ అధినేత చాన్స్ ఇవ్వడం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశారు బాజిరెడ్డి జగన్. చిన్నా, పెద్దా అంతా ‘గోవన్న’ అని ఆప్యాయంగా పిలుపుకునే మన అభిమాన నాయకుడిని ఈసారి కూడా భారీ మెజారిటీతో గెలిపించుకుందామని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.