ఉద్యమ నేత, బీరెఆస్ పార్టీ అధినేతే స్వయంగా తన నియోజకవర్గానికి వచ్చి పోటీ చేస్తానని ప్రకటించడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు ఎమ్మెల్యే గంప గోవర్దన్. ఇక్కడ నుంచి పోటీ చేయడమంటే ఆ నియోజకవర్గ ప్రజలకే కాదు, తనకూ అదృష్టంగా భావిస్తున్నాడాయన. అభివృద్ధి ఇక పరుగులు పెట్టడంతో పాటు కామారెడ్డి నియోజకవర్గానికి ఇక రాష్ట్రంలోనే ఓ ప్రత్యేక గుర్తింపు వస్తుంది.
తనూ అధినేత వెంట ఉండి తన గెలుపునకు, ప్రజలకు మరింత సేవ చేసేందుకు దొరికిన అదృష్టంగా ‘గంప’ భావిస్తున్నాడు. బీసీ నేతగా తనకు పార్టీలో, ప్రభుత్వంలో తగిన గుర్తింపు లభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అటు పరపతి, ఇటు తన నియోజకవర్గ ప్రగతి రెండూ తనకు కలిసి వచ్చే అంశాలేనని లెక్కలు వేసుకుంటున్నారు కామారెడ్డి బీఆరెస్ పార్టీ శ్రేణులు.