అర్వింద్‌కు ఆర్మూర్‌ షాక్‌….

ఆర్మూర్‌ బీజేపీ టికెట్‌ రాకేశ్‌ రెడ్డికి ఫైనల్‌…

తనకు కనీసం సమాచారం లేకుండానే అధిష్టానం పెద్దలతో సంప్రదింపులు జరిపి హామీ తీసుకున్న పారిశ్రామికవేత్త…

జూన్‌ 2 న ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరిక… అర్వింద్‌ ఆశలపై నీళ్లు.. పెద్దరికంపై పిడుగుపాటు..

 

వాస్తవం- ఆర్మూర్‌ ప్రతినిధి:

ఎంపీ అర్వింద్‌ ఇందూరు జిల్లాను గంపగుత్తగా తనదే అనుకున్నాడు. పార్టీని తన జేబులో పెట్టుకున్నాడనుకున్నాడు. తను ఎవరికి చెబితే వారు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అని ఊహించుకున్నారు. ఆశల పల్లకిలో విహరించాడు. అహంకార పూరితంగా కళ్లు నెత్తికెక్కితిరిగాడు. నిజామాబాద్‌ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో తన అనుచరులకు తలా ఒకటి చొప్పున పంచేశాడు. ఇక ఈ నియోజకవర్గాలు మీవేరా బాబు… చూస్కోండి.. ఏలుకోండి..! అంటూ పెత్తనం చేశాడు. పెద్దరికానికి పోయాడు. తీరా చూస్తే తను ఆశ పడ్డ అర్మూర్‌కే దిక్కు లేకుండా పోయింది. అర్వింద్ ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేద్దామనుకున్నాడు. అక్కడ ఖర్చీఫ్‌ ఏసుకుని కూసున్నాడు.

ఎంపీగా అలవికాని హామిలిచ్చి .. ఇక్కడ ప్రజలకే చేసిందేమీ లేక.. మళ్లీ ముఖం చూపించలేక ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఆర్మూర్ వేదికను ఎంచుకున్నాడు. ఇక్కడి నుంచైతే ఈజీగా గెలవచ్చనుకున్నాడు. ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉందిక్కడ. అందుకే అన్ని పార్టీల దృష్టి ఇక్కడే ఉంది. అర్వింద్‌ కూడా ఇదే తన కార్యక్షేత్రం అని ఎంచుకున్నాడు. తీరా అంకాపూర్‌కు చెందిన ఓ పారిశ్రామికవేత్త అర్వింద్‌ ఆశలకు గండికొట్టాడు. పైడి రాకేశ్‌రెడ్డి ఏకంగా ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరిపి ఆర్మూర్‌ టికెట్‌ దాదాపుగా కన్ఫాం చేసేసుకున్నాడు. జూన్ 2 .. తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం రోజునే ఢిల్లీలోనే పెద్దలతో కలిసి పార్టీ కండువా కప్పుకోనున్నాడు. దీనికి అర్వింద్‌కు ఆహ్వనం దొరుకుతుందంతే. అదీ అర్వింద్‌కు జిల్లాలో పార్టీ పట్ల ఉన్న పరువు, పరపతి పట్టు…

You missed