నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను ఓ టైంపాస్ ఎంపీగా అభివర్ణించారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, టీఆఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పి..గెలిచిన అర్వింద్… ఆ ఊసే ఇప్పటి వరకు ఎత్తకుండా.. రోజూ సోషల్ మీడియాలో అబద్దపు ప్రచారాలు చేస్తూ… సీఎం కేసీఆర్, కవిత, కేటీఆర్‌ను తిడుతూ కాలయాపన చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ఈ టైంపాస్ ఎంపీకి అయితే అబద్దపు ప్రచారాలు చేయడం.. లేకపోతే తిట్ట దండకం జపించడం తప్ప ప్రజలకు సేవ చేయడం తెలియదని, అభివృద్ధి చేయడం చేతకాదని, నిధులు తీసుకురావడం తరం కాదని ఆయన విమర్శించారు. జిల్లా ప్రజలకు అంతా అర్థమైందని, ఇక తగిన బుద్దిచెప్పి తగిన శాస్తి చేస్తారని ఆయన అన్నారు.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఓ ఒక్క గ్రామానికి కూడా రూపాయి నిధులు తేలేదని, ఇంతటి అసమర్థపు ఎంపీ ఎక్కడా ఉండడని దుయ్యబట్టారు. జక్రాన్ పల్లి మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను 70 మంది 70 లక్షలను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. కేంద్రంలో ఉన్న బిజెపి నాయకులు దొంగ బాబాలను తెలంగాణ రాష్ట్రానికి పంపుతూ ఇక్కడున్న ఎమ్మెల్యేలను డబ్బు ఆశ సూపి కొనాలని చూసి అడ్డంగా దొరికియాన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు బీజేపీ నాయకులను తరిమి తరిమి కొడతారని, తస్మాత్ జాగ్రత్త బిజెపి నాయకుల్లారా..! అని ఆయన హెచ్చరించారు.
మనసున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్.. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి ఆర్ధిక చేయూత గొప్ప పథకం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్
ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ గారు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు. ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన అన్ని హామీలను నెర వేర్చారని అన్నారు. ఆసరా ఫింఛన్ , రైతుల కోసం రైతు బంధు. రైతు భీమా, 24 గంటలు ఉచిత కరెంట్ , పేదల కోసం షాదీ ముబారక్ , కళ్యాణ లక్ష్మి వంటి అనేక పథకాలను అర్హులైన ప్రజలు ఆస్వాదిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
గత ప్రభుత్వాలు ఆడ పిల్లల పెళ్లిళ్ల కోసం ఆలోచించలేదు. ఆడ పిల్లల పెళ్లిళ్లు చేయాలంటే తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా ఉండేది . కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఆడపడుచులకు అండగా ఉంటు వారి పిల్లల పెళ్లిళ్లకు లక్ష నూట పదహారు రూపాయలు అందించి వారి కుటుంబంలో ఒకరిగా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుంచాల విమల రాజు , ఉమ్మడి జిల్లాల డిసిఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్ , వైస్ ఎంపీపీ ముస్క్ తిరుపతి రెడ్డి , మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నట్ట భోజన , మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు డికొండ శ్రీనివాస్ , మండల కోపరేషన్ అధ్యక్షులు ఏకే బుల్లెట్ ఖాన్ ,ప్రజాపతినిధులు మరియు స్థానిక అన్ని గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు ఎంపిటిసిలు, సొసైటీ డైరెక్టర్లు, టిఆర్ఎస్ సీనియర్, టిఆర్ఎస్ పార్టీ అన్ని అనుబంధ సంఘ నాయకులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొనరు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్దుల సంక్షేమానికి అధిక ప్రాదాన్యత:
జక్రాన్ పల్లి మండలంలో ₹ రెండు కోట్ల ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయము మరియు జూనియర్ కళాశాల, భవనాన్ని రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ..తెలంగాణలోని విద్యార్థులకు మంచి విద్య, మెరుగైన వసతి, మంచి భోజనం పెట్టాలని, భావి తరాలు ఆరోగ్యంగా, ఉన్నతంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. విద్యార్థులపై పెట్టే ఖర్చును భావితరం బాగుకోసం పెట్టే పెట్టుబడిగా ప్రభుత్వం భావిస్తున్నది ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్దుల సంక్షేమానికి అధిక ప్రాదాన్యతను ఇస్తున్నది అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల నుంచి ప్రభుత్వ విద్యా సంస్థలకు విద్యార్థుల వలసలు పెరుగుతున్నాయి అని ఆయన పేర్కొన్నారు. నాణ్యమైన విద్యావిధానం, ఇంగ్లిష్ మీడియంలో బోధన, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం వంటి విద్యాభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదు పెరిగింది అని ఆయన అన్నారు.