నిజామాబాద్ పట్టణ ఆర్య వైశ్య సంఘానికి 25,51,116/- రూ. ల విరాళాన్ని అందించిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు మరియు TRS పార్టీ NRI గ్లోబల్ కో ఆర్డినేటర్ శ్రీ మహేష్ బిగాల గారు…
నిజామాబాద్ పట్టణ సంఘానికి బిగాల కృష్ణ మూర్తి భవన్ గా నామ కరణం చేసిన సంఘ సభ్యులు…
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు మరియు TRS పార్టీ NRI గ్లోబల్ కో ఆర్డినేటర్ శ్రీ మహేష్ బిగాల గారి తండ్రి బిగాల కృష్ణ మూర్తి గారి జ్ఞాపకార్థం నిజామాబాద్ పట్టణ ఆర్య వైశ్య సంఘం భవనానికి 25,51,116/-రూ. ల విరాళాన్ని సంఘ సబ్యులకు అంద చేశారు.
25,51,116/- రూ. ల విరాళాన్ని స్వీకరించిన సంఘ సభ్యులు నిజామాబాద్ పట్టణ ఆర్య వైశ్య సంఘాన్ని బిగాల కృష్ణ మూర్తి భవన్ గా నామ కరణం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు మాట్లాడుతూ…
●1 కోటి 50 లక్షల రూ. లతో నిజామాబాద్ పట్టణ ఆర్య వైశ్య సంఘం నిర్మాణం జరుగుతుంది.మరి కొద్ది రోజుల్లో భవనం పూర్తవుతుంది.
●మా తండ్రి గారయిన కీ.శే.బిగాల కృష్ణ మూర్తి గారు మనతో లేకపోయినా వారి జ్ఞాపకార్థంగా 25,51,116/- రూ. ల విరాళా న్ని మా తరపున అందచేశాము.
●మా నాన్న గారికి అతి ఇష్టమైనవి విద్య,అన్న దానము కార్యక్రమాలు.అమిత మైన దైవ భక్తుడు.
●వారు అనేక రకాల సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించారు.
●దుర దృష్టంగా వారు లేనప్పటికి వారి జ్ఞాపకార్థం సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము.కరోన సమయం లో రెండు దశల్లో భోజన వితరణ కార్యక్రమం నిర్వహించాము.
●మాక్లూర్ గ్రామంలో గతం లో మా తాత గారు బిగాల గంగారాం మొదటి సర్పంచ్ గా ఉన్నపుడు పాఠశాల నిర్మించారు.ఆ పాఠశాలలో మా నాన్న గారు, మేము చదువుకున్నాము.
●మా తాత గారు మరియు మా నాన్న గారి జ్ఞాపకార్థం అధునాతన సాధులయాలతో 5 కోట్ల 70 లక్షల రూ.లతో స్కూల్ నిర్మిస్తున్నాము.4 కోట్ల 70 లక్షలు ప్రభుత్వం మంజూరు చేయగా, 1 కోటి రూ.లు విరాళంగా ఇచ్చాము.ఈ యొక్క స్కూల్ తెలంగాణ లొనే టాప్ 5 లో ఉండే విధంగా నిర్మిస్తున్నాము.
●ప్రైమరీ స్కూల్ కి మా తాత గారి పేరు బిగాల గంగారాం, హై స్కూల్ కి మా నాన్న గారు పేరు బిగాల కృష్ణ మూర్తి గారి జ్ఞాపకార్థం నిర్మిస్తున్నాము.
●మాక్లూర్ గ్రామంలో మోడర్న్ స్మశాన వాటికని కూడా నిర్మించాము.
●పట్టణ ఆర్య వైశ్య సంఘం 70 సంవత్సరాల క్రితం నిర్మించారు.శిథిలావస్థకు చేరిందని 1 కోటి 50 లక్షల రూ. లు ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి మీ అందరి సహకారంతో భవనాన్ని నిర్మించుకుంటున్నాము.మరి కొద్ది రోజుల్లోనే ఈ యొక్క భవనాన్ని మీ అందరి సమక్షంలో ప్రారంభించుకుందాము.
●పట్టణ ఆర్య వైశ్య సంఘానికి మేము ఇస్తున్న 25,51,116/- రూ.ల విరాళాన్ని స్వీకరించి భవనానికి బిగాల కృష్ణ మూర్తి భవన్ గా మార్చుటకు ఆమోదం తెలిపిన పట్టణ సంఘ కార్యవర్గ సబ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.
●పట్టణ ఆర్య సంఘం అధ్యక్షులు భూమా లింగం గుప్తా స్మశాన వాటికలో సమస్యలు ఉన్నాయని నా దృష్టికి తెచ్చారు.మీ అందరి సమక్షంలో స్మశాన వాటికని పరిశీలిస్తాను.అవసరమైన వసతులని ఏర్పాటు చేస్తానని మాటిస్తున్నాను.
ఈ కార్యక్రమంలో TRS పార్టీ NRI గ్లోబల్ కో ఆర్డినేటర్ శ్రీ మహేష్ బిగాల గారు మాట్లాడుతూ…
●ఈ కార్యక్రమానికి వచ్చిన ఆర్యవైశ్య సంఘం సభ్యులు సోదర సోదరిమణులకి నమస్కారం.
●మా నాన్నగారు పరపాదించడం మాకు తీరని లోటు.వారి స్మృతి లో ఉంటూ వారి జ్ఞాపకార్థం గా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము.
●మా నాన్న గారికి ఇష్ట మైనవి అన్నదానం, బడి మరియు గుడి.మా నాన్న గారి జ్ఞాపకార్థం అన్నదానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము.
●మాక్లూర్ గ్రామంలో 5 కోట్ల 70 లక్షల రూ. లతో గౌ. ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి సహకారంతో స్కూల్ ని నిర్మిస్తున్నాము.ప్రభుత్వం 4 కోట్ల 70 లక్షలు మంజూరు చేయగా మేము కోటి రూ.లు స్కూల్ నిర్మాణానికి విరాళంగా ఇచ్చాము.
●మాక్లూర్ గ్రామంలో విటలేశ్వర మందిరాన్ని నిర్మిస్తున్నాము.
●మా నాన్నగారు సహకారం,ప్రోత్సాహంతో మేము ఈ రోజు ఈ స్థాయికి వచ్చాము.మేము ఏ పని చేయాలన్న వారి నిర్ధేశం ప్రకారం ముందుకు వెళ్ళేవాళ్ళం.ఒక మంచి అను బంధాన్ని మా నాన్న గారితో కలిగిఉన్నాము.
●వారిని ఎల్లపుడు స్మరిస్తూ వారు చూపిన మార్గం లో నడుస్తూ వారి జ్ఞాపకార్థం నిజామాబాద్ పట్టణ ఆర్య వైశ్య సంఘానికి 25 లక్షలు రూ.విరాళంగా ఇచ్చాము.సంఘానికి బిగాల కృష్ణ మూర్తి భవన్ గా నామకరణం చేయుటకు సహకరించిన సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.
●పట్టణ ఆర్య వైశ్య సంఘానికి 25 లక్షలు విరాళం అందించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారిని TRS పార్టీ NRI గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల గారిని సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య పట్టణ సంఘం అధ్యక్షులు ఉప్పాలంచ భూమా లింగం గుప్త గారు,ప్రధాన కార్యదర్శి గజావాడ హన్మంత్ రావు గారు,కోశాధికారి కొవూరి జగన్ గుప్త, నుడ డైరెక్టర్ మల్లేష్ గుప్త, కార్పొరేటర్ ప్రభాకర్ గుప్త, అర్వపల్లి పురుషోత్తం గుప్త, మోటూరి దాయనంద్ గుప్త, కొళ రాం గుప్త, మాదని శ్రీధర్,పల్తీ రవి,ప్రవీణ్,చిదుర శ్రీను,కాసుబా సంపత్, మారా ప్రభు, ప్రవీణ్, సంతోష్,హరి బాబు పట్టణ ఆర్యవైశ్య సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.