నమ్మకు నమ్మకు ఈ రేయినీ… కమ్ముకు వచ్చిన ఈ మాయనీ.. ఓ సినిమాలో పాట ఇది. ఇది అచ్చం ఎన్నికల సమయానా… పోలింగ్‌కు ఒక రోజు ముందు ఓటర్లకు కరెక్టుగా నప్పుతది.. ఓటర్లే కాదు లీడర్లకూ దీన్ని ఆపాదించవచ్చు. ఇప్పటి వరకు జరిగిందంతా ప్రచారమే.అ దే ఎవరెన్ని ఇస్తారని. ఇప్పటికి అనుకున్న అంచనాలు చేరలేదు నాయకులు. ఆశలైతే బాగానే పెట్టారు. ఎక్కడికక్కడ డబ్బుల డంపులు కట్టడవుతున్నాయి. అవి ఓటరు చేతికి అందితేనే గానీ విజయవకాశాలు లెక్కలు వేసుకునే పరిస్థితి లేదు.
అందుకే ఈ రాత్రి కీలకం. ఓటరుకు ఎంత ముట్టింది…? ఎవరు ముట్టజెప్పారు…? ఆ ఇచ్చినవాళ్లు అనుకున్నంతా ఇచ్చారా..? లేదా..? అయితే అవతలోడు ఎంతిచ్చాడు….? ఎవరెక్కివిచ్చారు..? ఎవరికి వేద్దాం..? తక్కువిచ్చినా సరే.. మన పార్టీ అదే కదా.. వాళ్లకే వేద్దాం. వీడితో ఏం ఉపయోగం..? ఇప్పటిదాకా మనతోని ఉన్నదెవరు..? రేపు కలిసి వచ్చేదెవరు..? డబ్బులే ముఖ్యమా.? పార్టీని కూడా చూడాలె కదా..? ఇగో ఇవన్నీ సమీకరణలకు తెల్లారి ఓ క్లారిటీ వస్తుంది. వాస్తవంగా ఇప్పటికే ఓటరు క్లారిటీతో ఉన్నాడు. ఇక డబ్బులు పోటీలు పడి పంచడమే మిగిలి ఉంది. ఇదీ ఇప్పుడు నాయకులకు అసలైన టాస్క్. మొన్నటి దాకా చేసిన ప్రచారం ఒకెత్తు. ఇప్పుడు ఓటరును రహస్యంగా ఇంటింటికి కలవడమే కీలకం.