మునుగోడు పోరు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. బీజేపీ, టీఆరెస్ నువ్వా నేనా అన్న‌ట్టుగా ఇక్క‌డ పోటీ ఉంది. బీజేపీ … టీఆరెస్‌కు గ‌ట్టిపోటీ ఇస్తోంది. వాస్త‌వం ఇక్క‌డ స‌ర్వే నిర్వ‌హించింది. ఈ స‌ర్వేలో తేలిన వాస్త‌వాల ఆధారంగా ఇస్తున్న క‌థ‌నం ఇది. బీజేపీ క్యాండేట్ రాజ‌గోపాల్ రెడ్డిపై వ్య‌క్తిగ‌తంగా చాలా చోట్ల సానుభూతి ఉంది. ఇది టీఆరెస్‌కు మైన‌స్ అవుతోంది. కాంగ్రెస్ అభ్య‌ర్థి పాల్వాయి స్ర‌వంతి బ‌ల‌మైన అభ్య‌ర్థి కాక‌పోవ‌డంతో కాంగ్రెస్ ఓట్లు బీజేపీ వైపు పోయే ప్ర‌మాదం ఉంది. ఇదీ టీఆరెస్ విజ‌యానికి గండి కొట్టే ఓ కార‌ణం.

ఇదిలా ఉంటే… రేపు చండూర‌ల్ జ‌రిగే టీఆరెస్ భారీ బ‌హిరంగ స‌భ‌కు కేసీఆర్ వ‌స్తున్నారు. ఇది ఆ పార్టీకి కీల‌కం. టీఆరెస్ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసే వ్య‌వ‌హారంలో బీజేపీ అడ్డంగా బుక్క‌య్యింది. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్ మాట్లాడ‌లేదు. కానీ ఆడియో టేపులో విడుద‌ల చేశారు. దీంతో బీజేపీ దొంగ అని తేలిపోయింది. దొరికితే దొంగ అంతే. ఇప్పుడు ప్ర‌జాక్షేత్రంలో దోషి బీజేపీ. దీనిపై రేపు భారీ బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ మాట్లాడ‌నున్నారు. బీజేపీని ఎండ‌గ‌ట్టి.. ఉతికి ఆరేయ‌నున్నారు. ఇది ఆ పార్టీకి ట‌ర్నింగ్ పాయింట్. కేసీఆర్ ఈ మునుగోడులో ఎట్టి ప‌రిస్థితుల్లో గెల‌వాల‌నుకున్నారు. గెలిచి తీరుతాడు. కానీ ఎంత మెజారిటీ అనేదే ఇప్పుడు ఇజ్జ‌త్ కా స‌వాల్‌. ఓ వైపు బీజేపీ నంగ‌నాచి దొంగ వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డ్డా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు.

హోరా హోరీగా, పోటా పోటీగా నిలుస్తున్న‌ది. దీన్ని నిలువ‌రించ‌డంలో టీఆరెస్ శ్రేణులు పూర్తి స్థాయిలో స‌ఫ‌లీకృతం కాలేదు. రేపు కేసీఆర్ స‌భ‌.. ఆ త‌ర్వాత పోలింగ్ మేనేజ్‌మెంట్ లో ఆయ‌న వేసే ఎత్తుగ‌డే విజ‌యానికి కీల‌కం కానున్నాయి. బీఆరెస్‌గా ఇదే టీఆరెస్‌కు తొలిబోణి. దేశ రాజ‌కీయాలు ఆస‌క్తి గా చూస్తున్న ఈ ఫ‌లితం స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌ను రేపుతోంది.

You missed