బండి సంజయ్‌ కొడుకు తోటి దోస్తును తుక్కు కింద కొట్టాడు. బూతులు తిట్టాడు. సహజం. నాన్న ఇచ్చిన స్వేచ్చ అది. అధికారం తెచ్చిపెట్టిన తలపొగరది. ఎవడేం చేస్తాడులే అనే దురహంకారమది. వీడియో బయటపడ్దది. వాడి రౌడీయిజమూ నలుగురికి తెలిసి వేనోళ్ల పొగిడారు తండ్రినీ, కొడుకును. కేసులు పెట్టారు. సహజం. దీనిపై బండి నోర్మూసుకుని కూసుంటే బాగుండేది. అదేదో తప్పే కాదన్నట్టు. అది పిల్లల అల్లరి పనులన్నట్టు.. తన కొడుకు సుద్దపూస అన్నట్టు ఏవేవో మాట్లాడాడు. నీ మనవడి గురించి చెప్పనా..? అంటూ తనకు అలవాటైన దోరణిలో బ్లాక్‌మెయిలింగుకూ దిగాడు. దీన్ని ఎవరూ సమర్థించలే.

మతం పేరుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి పబ్బం గడుపుకొని, పార్టీని ఎలాగైనా అధికారంలోకి తేవడానికి ఎంతటి అబద్దాలు, నీచాలకైనా దిగజారినప్పుడు.. పిల్లలు ఇలా కాక ఎలాగుంటారు. పెద్దగా ఆశ్చర్యమేమీ లేదు. కానీ ఇక్కడ బీఆరెస్‌ నాయకులు దీన్ని వైరల్‌ చేసి వాడిని హీరో చేస్తున్నారు. ఎమ్మెల్యేల తమ్ముండ్లు, కొడుకులు ఇంతకన్నా దౌర్జన్యాలు, దారుణాలు చాలానే చేస్తున్నారు. అవి బయటకు రావు. అంతే. అంతటా ఇది సహజం. బయట పడ్డప్పుడే ఇలా తలొక నీతి చెబుతారు. హితవులు పలుకుతారు. జడ్జిమెంట్లు ఇస్తూ ఉంటారు.అన్నీ అవే తాను ముక్కలు. నియోజకవర్గ ఇన్‌చార్జిలుగా కొన్ని చోట్ల ఎమ్మెల్యేల తమ్ముండ్లు షాడో ఎమ్మెల్యేలుగా చేస్తున్న దాష్టీకాలు తెలియవా..? మరి ఎవరు బయటపెట్టాలి. ప్రజలకు తెలుసు. అన్నీ. సరైన సమయంలో అన్నీ బయటకు వస్తాయి. ఫలితాలు కనిపిస్తాయి. అన్నింటికీ వీడియోలుండవు. సాక్ష్యాలూ ఉండవు. కానీ తెలిసిపోతూ ఉంటాయి. సమయం వచ్చినప్పుడు దిమ్మదిరిగేలా ఉంటుంది పంచ్‌….

You missed