ఇప్పుడు బీజేపీ రాజ‌కీయంలో కొత్త చ‌ర్చ మొద‌లైంది. అదీ డ‌బ్బు పంపిణీ. రాజ‌గోపాల్ రెడ్డికి చెందిన డ‌బ్బు పంపిణీ జ‌రుగుతున్న స‌మ‌యంలో క‌రెక్టుగా స‌మాచారం ఇచ్చి పోలీసుల‌కు ప‌ట్టిచ్చిన కోవ‌ర్టు ఎవ‌రు..? అన్ని చోట్లా దాదాపు ఇదే రిపీట్ అయ్యింది. ఎలా..? స‌రిగ్గా డ‌బ్బు చేరేవేసే స‌మ‌యంలో … పోలీసులు రావ‌డం .. ప‌ట్టుకోవ‌డం.. డ‌బ్బుసీజ్ చేయ‌డం…. ఇవ‌న్నీ క్ర‌మంగా ప్లానింగ్ ప్ర‌కారం జ‌రిగిపోతూ వ‌చ్చాయి.

ఇలా రాజ‌గోపాల్ రెడ్డికి చెందిన 15 కోట్ల రూపాయ‌లు పోలీసులు ప‌ట్టుకున్నారు. అదీ ఓ కోవ‌ర్టు ఇచ్చిన స‌మాచారంతో. ప‌క్కా ఇన్ఫ‌ర్మేష‌న్‌తో. ఎవ‌రా టీఆరెస్ కోవ‌ర్టు..? త‌న‌కు అత్యంత ద‌గ్గ‌ర‌గా ఉన్న వారికి మాత్ర‌మే ఆ డ‌బ్బు గురించి తెలుసు. అవి ఎప్పుడు ఎక్క‌డికి త‌ర‌లివెళ్లాలి…? ఏ మార్గం గుండా వెళ్లాలి..? అనేది కూడా అత్యంత ద‌గ్గ‌రి వ్య‌క్తుల‌కు మాత్ర‌మే తెలుసు. వాళ్లే దాన్ని ఆప‌రేట్ చేస్తారు. మ‌రి అలాంటిది ఇంత ర‌హ‌స్య‌మైన విష‌యం పోలీసుల‌కు క‌రెక్టుగా అదే స‌మ‌యంలో ఎలా తెలిసింది. అదే దారిలో.. వ‌చ్చి స‌రిగ్గా డ‌బ్బున్న వాహ‌నాన్నే ఎలా పోలీసులు ట్రేస్ చేయ‌గ‌లిగారు…? ప‌ట్టుకోగ‌లిగారు..? ఇంత ప‌క్కా ప‌క‌డ్బందీ స‌మాచారం ఇచ్చిన ఆ కోవ‌ర్టు ఎవ‌రు..? ఇప్పుడు బీజేపీలో జ‌రుగుతున్న చ‌ర్చ ఇదే.

రాజ‌గోపాల్ రెడ్డి అన్వేష‌ణా ఇదే. త‌న ఓట‌మికి ఈ కోవ‌ర్టు ఇచ్చిన స‌మాచార‌మే ప్ర‌ధాన కార‌ణ‌మైంద‌ని రాజ‌గోపాల్ రెడ్డి భావిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌ను అనుకున్న స్థాయిలో ఓట‌ర్ల‌కు డ‌బ్బులు పంపిణీ చేయ‌లేదు. దీన్ని క‌ట్ట‌డి చేయ‌డంలో టీఆరెస్ స‌క్సెస్ అయ్యింది. అందుకు బీజేపీలోని… రాజ‌గోపాల్‌రెడ్డికి అత్యంత ద‌గ్గ‌ర‌గా ఉన్న వ్య‌క్తే కోవ‌ర్టుగా వ్య‌వ‌హ‌రించాడ‌నేది వారి అనుమానం. ఇప్పుడు ఇదే అన్వేష‌ణ ఆ పార్టీలో జ‌రుగుతున్న‌ట్టు బీజేపీ శ్రేణులే చెప్పుకుంటున్నారు.

You missed