ఆ ఇద్దరూ సిద్దాంతాలు పక్కన పెట్టారు. బద్ద విరోదులను కాసేపు మరిచారు. ఎవరి లాభాలు, వారి వారి అవసరాలు అప్పటికప్పుడు చూసుకున్నారు. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా..? బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకుల గురించి. ఎవరా నాయకులని ఆరా తీస్తున్నారు. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్. ఏమైంది అని అంటారా..? బీజేపీలో ఓ సెక్షన్‌ ప్రచారం చేస్తున్న వార్త ఇది. నేను చెప్పే కవిత్వం కాదు.. కథనం అంతకన్నా కాదు. అసలేం జరిగింది..? ఆగండి.. వస్తున్నా .. అక్కడికే. మాజీ మేయర్‌, డీఎస్‌ తనయుడు ధర్మపురి సంజయ్‌ కాంగ్రెస్‌ నుంచి నిజామాబాద్‌ అర్బన్‌ టికెట్‌ ఆశిస్తున్నాడు.

డీఎస్‌ తో ఉన్న సంబంధాల నేపథ్యంలో సంజయ్‌కే ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ డీఎస్‌ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడం.. రాజకీయ పరిణామాలు మారడం.. కాంగ్రెస్‌లో ఓ సెక్షన్‌ బలంగా వ్యతిరేకించడం వల్ల సంజయ్‌కు టికెట్‌ విషయంలో పెద్ద డౌట్ ఏర్పడింది. నీకా నాకా అంటూ అందింకా తెమలలేదు. కానీ సంజయ్‌ తమ్ముడు, నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ మాత్రం తన అన్నకే టికెట్ ఇవ్వాలని మాజీ మంత్రిని కోరుతన్నాడట. ఓ బీజేపీ మీటింగు వేదికగా ఇదే విషయాన్ని పరోక్షంగా వెల్లడించాడు కూడా. సుదర్శన్‌రెడ్డి కూడా ఈ ఒప్పందానికే దాదాపు కట్టుబడి ఉన్నాడట. దీనికి ప్రతిఫలంగా బోధన్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ఙిగా మేడపాటి ప్రకాశ్‌రెడ్డికి కాకుండా నిన్నమొన్న వచ్చిన మోహన్‌రెడ్డికి ఇవ్వాల్సిందిగా ప్రతిపాదన పెట్టాడట. మోహన్‌రెడ్డి పోటీలో ఉంటే తన గెలుపు సులవవుతుందట మరి. అందుకే మొదటి లిస్టులో మేడపాటి పేరు నిలిచిపోయిందట. దీన్ని అర్వింద్‌ వ్యతిరేక శ్రేణులు, బీజేపీ నాయకులే తెగ వైరల్ చేసేస్తున్నారు.

అర్వింద్‌పై అధిష్టానానికి ఫిర్యాదు..

బీజేపీ మీటింగులో డీఎస్‌ గురించి మాట్లాడటం పై బీజేపీ సీనియర్‌ నేతలు, పార్టీ కమిటెడ్‌ నాయకులు అర్వింద్‌పై మండిపడుతున్నారు. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. డీఎస్‌కు, బీజేపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉంది. పార్టీ పరంగా, వ్యక్తిగతంగా కూడా. ఇప్పుడు బీజేపీ నేతగా, ఓ ఎంపీగా డీఎస్‌ పేరును ఎలా ప్రస్తావిస్తాడంటూ వీరు అధిష్టానానికి అర్వింద్‌ మాట్లాడిన వీడియోను పంపించారు. మరోవైపు ఇదే వీడియోకు అన్న కోసం తమ్ముడి ఆవేదన అంటూ వైరల్‌ చేసి తింపుతున్నారు.

You missed