బిల్కిస్ బానో దోషుల విడుదలలో జోక్యం చేసుకోండి

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ

లేఖ‌లోని ముఖ్యాంశాలు….

*బాధతప్త హృదయంతో మీకు ఈ లేఖ రాస్తున్నాను.రేప్ వంటి నేరాలు మన సామాజిక స్పృహను కుదిపేస్తాయి.

*శిక్ష పడిన రేపిస్టులు స్వాతంత్ర దినోత్సవం నాడు బయటికి రావడంతో ప్రతీ ఒక్కరికి వెన్నులో వణుకు పుడుతోంది

*సీబీఐ దర్యాప్తు చేసిన కేసుల్లో దోషుల శిక్షను తగ్గించడం లేదా విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఈ కేసులో 11 మంది దోషుల విడుదలకు కేంద్ర ప్రభుత్వంతో గుజరాత్ ప్రభుత్వం సంప్రదింపులు జరిపిందో లేదో స్పష్టత లేదు..

*ప్రభుత్వాలు రిమిషన్ అధికారాలను ఏకపక్షంగా ఉపయోగించవద్దని వాస్తవిక దృష్టితో రీమిషన్ అధికారాలను ఉపయోగించాలని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది…
*రేపిస్టులు బయటకు రావడాన్ని , ఈ పూలదండలు వేసి స్వాగతం చెప్పడాన్ని చూసి బాధితురాలు బానో మనసు ముక్కలయ్యి ఉంటుంది….

*ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని దోషుల విడుదల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చర్యలు చేపట్టాలి…

You missed