ఆర్మూర్ ఎమ్మెల్యే… ఆశ‌న్న‌గారి జీవ‌న్‌రెడ్డి మీద హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. ఇది ప్లానింగా..? కుట్రా…?? అనేది కాసేపు పక్క‌న పెడ‌దాం. ఆయ‌న నిజామాబాద్ జిల్లా అధ్య‌క్షుడు. ఇప్ప‌టి వ‌ర‌కు జిల్లా క‌మిటీల‌కు, రాష్ట్ర క‌మిటీల‌కు దిక్కు లేదు. న‌గ‌ర క‌మిటీలు వేశారు. అనుబంధ సంఘాల క‌మిటీలూ వేశారు. కానీ ఎవ్వ‌రూ ఇంత వ‌ర‌కు జీవ‌న్‌రెడ్డి మీద జ‌రిగిన హ‌త్యాయ‌త్నాన్ని ఖండించిన పాపాన పోలేదు. ఆర్మూర్‌లో కొంత మంది ఖండించారు. అంత వ‌ర‌కే.

అధికార పార్టీకి చెందిన ఓ అధ్య‌క్షుడికి ఇలా జ‌రిగినా ఆ పార్టీలో చ‌ల‌నం లేదు. ఎందుకు…? లైట్ తీసుకున్నారా..? పైనుంచి ఆదేశాలు రాలేదా..?? క‌మిటీలే వేయ‌లేదు… మ‌మ్మ‌ల్ని ప‌ట్టించుకునే నాథుడే లేడు… అని స‌రిపెట్టుకున్నారా..?? పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ నియ‌మితులైన త‌ర్వాత పార్టీ ప‌ద‌వులు వ‌స్తాయ‌ని ఉద్య‌మ‌కారులు,సీనియ‌ర్ నాయ‌కులు భావించారు. కానీ అలా జ‌ర‌గ‌లేదు. నిర్ల‌క్ష్య‌మే క‌నిపించింది. ఏకంగా కేటీఆర్‌కు స‌న్నిహితుడిగా చెప్పుకునే జీవ‌న్ రెడ్డిపైనే ఇలా జ‌రిగిందంటే.. పార్టీ నాయ‌కులు ఎవ‌రూ ఖండించ‌లేదంటే ఏమిట‌ర్థం..? మ‌రీ అధికార పార్టీ ప‌రిస్థితి ఇంత అధ్వాన్న‌మా..??

You missed