తీన్మార్ మల్లన్న అరెస్టును ఒకరు అక్రమ అరెస్టుగా అభిప్రాయపడితే మరొకరు ఇది సరైన చర్య అని తగిన గుణపాఠం జరిగిందని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తీన్మార్ మల్లన్న అరెస్ట్ పై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. జర్నలిస్ట్ సంఘాలు మాత్రం దీనిపై చప్పుడు చేయడం లేదు. సైలెంట్‌గా గమనిస్తున్నారు. పార్టీలు సైతం స్పందించాలా.. వద్దా.. అని ఆచితూచి స్పందిస్తున్నారు.

దాదాపు రెండు వారాల తర్వాత తెలంగాణ జర్నలిస్టుల ఫోరం దీనిపై మీటింగ్ నిర్వహించింది. పల్లె రవి కుమార్ తీన్మార్ మల్లన్న అరెస్ట్‌ను అక్రమ అరెస్టుగా పేర్కొన్నాడు. మరో వైపు తీన్మార్ మల్లన్న 31 కేసులు నమోదైయ్యాయని ఎఫ్‌ఐఆర్ నంబర్లతో సహా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. బ్లాక్‌మెయిల్, సెటిల్‌మెంట్ దందాలు, మహిళలను, దళితులను వేధింపులకు గురి చేయడం, హ్యకింగ్ మొదలుకొని అనేక రకాల సైబర్ క్రైమ్స్, తప్పుడు వివరాలతో పొరుగు రాష్ట్రాల్లో సిమ్‌కార్డులు కొనుగోలు చేసి వాటిని వాడి డబ్బుల కోసం బెదిరించిన విషయంలో ఈ కేసులు నమోదయ్యాయని వైరల్ చేస్తున్నారు.

https://youtu.be/tctyiG7225w

You missed