ప్ర‌భుత్వం విదేశాల‌కు వెళ్లే వారి కోసం ఆస్ప‌త్రుల్లో ప్ర‌త్యేక వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేస్తున్న‌ది. మొద‌టి డోస్‌తో పాటు 28 రోజుల్లోనే రెండ‌వ డోసు ఇవ్వ‌నున్నారు. వ్యాక్సిన్‌కు వ్యాక్సిన్‌కు మ‌ధ్య 28 రోజుల వ్య‌వ‌ధి ఉంటేనే విదేశాల‌కు అనుమ‌తినిస్తుండ‌డంతో ప్ర‌భుత్వం ఈ వెసులుబాటు క‌ల్పించింది. దీంతో అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్లు, ఆస్ప‌త్రుల‌లో ర‌ద్దీ పెరిగిపోయింది. నిజామాబాద్‌, కోరుట్ల‌, క‌రీంన‌గ‌ర్‌, జ‌గిత్యాల్ త‌దిత‌ర ప్రాంతాల నుంచి గ‌ల్ఫ్‌కు వెళ్లే వారు అధికంగా ఉంటారు. క‌రోనాకు ముందు వ‌చ్చి ఇక్క‌డే వీరంతా ఉండిపోయారు. చేసుకోవ‌డానికి ప‌నుల్లేవు. మ‌ళ్లీ గ‌ల్ఫ్‌కు వెళ్దామంటే క‌రోనా వీడ‌లేదు. మొత్తానికి విదేశాల‌కు వెళ్లేందుకు వ్యాక్సిన్ వేసుకుంటే అనుమ‌తినిస్తార‌ని తెలియ‌డంతో ఆస్ప‌త్రుల‌కు టీకా కోసం ప‌రుగులు పెడుతున్నారు. వీసా ఆధారంగా వ్యాక్సినేష‌న్ చేస్తున్నారు. కొవీషిల్డ్ కుమాత్ర‌మే అనుమ‌తినివ్వ‌డంతో అవే టీకాలు వేస్తున్నారు. 28 రోజుల త‌ర్వాత రెండో డోసు తీసుకోగానే వెంట‌నే స‌ర్టిఫికేట్ జారీ చేస్తున్నారు.

You missed