ల‌క్ష కొత్త పింఛ‌న్లు పెండింగ్‌… రెండేండ్ల నుంచి…

స‌విత‌…

ఏడాది అవుతుంది భ‌ర్త చ‌నిపోయి.

వితంతు పింఛ‌న్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ది. రెండ్రోజుల‌కొక‌సారి ఆ ఊరి స‌ర్పంచుకు ఫోన్ చేసి అడుగుతున్న‌ది. నా పింఛ‌న్ మంజూరు అయిందా? అని. లేద‌మ్మా. గ‌వ‌ర్న‌మెంటు ఇంకా కొత్త పింఛ‌న్లు ఇవ్వ‌డం లేదు. ఇంకా టైం ప‌డ‌త‌ది. ఏడాదిగా ఇదే జ‌వాబు. విసిగి వేసారిన స‌విత‌. ఇక ఫోన్ చేయొద్ద‌ని అనుకున్న‌ది. త‌న రాత‌లో ఉంటే వ‌స్తుంది. లేక‌పోతే లేదు అని నిర్ణ‌యం తీసుకున్న‌ది. టైల‌రింగ్ చేస్తూ ముగ్గ‌రు పిల్ల‌ల‌ను పోషిస్తున్న‌ది భారంగా.

రెండేండ్లుగా కొత్త పింఛ‌న్ల‌కు మోక్షం లేదు. వితంతు, విక‌లాంగులు… ఇలా అన్ని ర‌కాల పింఛ‌న్లు కొత్త‌వి మంజూరి కావ‌డం లేదు. దాదాపుగా రెండేండ్ల నుంచి.

క‌రోనా..

ఆర్థిక సంక్షోభం. ఆదాయం లేదు..
ఇవ‌న్నీ చెప్తున్న‌ది ప్ర‌భుత్వం.

కానీ,
త‌న అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు మాత్రం ఫ‌క్తు రాజ‌కీయ‌మే చేస్తున్న‌ది.

ద‌ళిత‌బంధు పేరుతోవేల కోట్లు ఖ‌ర్చు చేసేందుకు రెడీ అయ్యింది.

ద‌ళితుల‌కు మేలు జ‌రిగితే వ‌ద్ద‌న‌డం లేదు. కానీ అది మీ రాజ‌కీయ అవ‌స‌రాల‌కు అస్త్రంగా మారింద‌నేదే అస‌లు స‌మ‌స్య‌.

స‌రే మీరు .. మీ రాజ‌కీయాలు గంగ‌లో ప‌డండి.

పింఛ‌న్లు ఎందుకియ్యడం లేదు. ఉన్న వారికి రెండున్నెళ్ల ఆల‌స్యంగా ఇస్తున్నారు.

కొత్త‌వి రెండేండ్లుగా పెండింగ్‌. దాదాపు ల‌క్ష వ‌ర‌కు కొత్త ద‌ర‌ఖాస్తుల‌ను అలా అట‌కెక్కించారు.

ఏమ‌న్నా అంటే ఫ‌క్తు రాజ‌కీయ‌మంటారు? ఓట్ల కోస‌మే క‌దా ప‌థ‌కాలు అంటారు.

మీ కళ్ల‌కు భ‌ర్త‌లు స‌చ్చిపోయి .. పెద్ద దిక్కు లేక బిక్కు బిక్కు మంటున్న వితంత‌వులు క‌నిపించ‌డం లేదా?

అంగ‌వైక‌ల్యంతో మీరిచ్చే పింఛ‌న్ కోసం అంగ‌లారుస్తున్న విక‌లాంగులు క‌నిపించ‌డం లేదా?

 

You missed