ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. ఈ సీజన్ లో అతి తక్కువ సమయంలోనే ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిండకుండాల మారింది. అక్టోబర్ వరకు ప్రాజెక్టు నిండిన దఖాలాలు లేవు. బెల్గాన్ రిజర్వాయర్, విష్ణుపురి,బాబ్లీ గేట్లను ఎత్తివేశారు. దీంతో ఇన్ ప్లో జోరుగా వస్తున్న‌ది. మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు మహాప్రాజెక్ట్ లు నిండిపోయి గోదావరిలోకి వరద పోటెత్తుంది. ఎగువ ప్రాంతంలో ఉన్న విష్ణపురి, బెల్గాన్ బ్యారేజ్,బాబ్లీ ప్రాజెక్ట్ లతోపాటు 150 వరకు చిన్న చితక బ్యారేజ్ నిండి గోదావరిలోకి నీరు వచ్చి చేరుతున్న‌ది. గురువారం ఉదయం 6 గంటలకు ప్రాజెక్టులో 1088 అడుగులు ఉండగా 78 టీఎంసీల నీటి నిల్వ ఉండగా 71202 క్యూసెక్కులు ఉండగా సాయంత్రం 4 గంటలకు 1090 అడుగులు 89 టీఎంసీలు కాగా 4 లక్షల క్యూసెక్కుల వరద ఎగువ నుంచి వస్తున్న‌ది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్ట్ పరీవాహక ప్రాంతం నుంచి వరద నీరు ప్రాజెక్ట్ లోకి వస్తుంది. ఎస్సారెస్పీ నిండు కుండాల మారడంతో ప్రాజెక్ట్ అధికారులు 32 గేట్లను ఎత్తి 2.50 లక్షల క్యూసెక్యుల నీటిని క్రిందికి వదిలారు.

— ప్రస్తుతం ప్రాజెక్ట్ లో నీటి నిల్వ

ఎస్సారెస్పీలో 1091 అడుగులకు గాను 1090 అడుగులు ఉండగా 90 టీఎంసీలకు గాను 89 టీఎంసీల నీటి నిల్వ ఉన్న‌ది. ప్రాజెక్టులోకి 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు రాగా 32 గేట్లు ఎత్తి 2.5 లక్షల వరదనీరు గోదావరి లోకి వదిలారు.ఎస్కేప్ గేట్ల ద్వారా 9 వేల క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తున్నారు.కాకతీయ కాలువకు 50 క్యూసెక్కులు విడుదల చేశారు. లక్ష్మీ కాలువ,గుత్ప, అలీసాగ‌ర్ ఎత్తిపోతల పథ‌కానికి నీటిని అధికారులు నిలిపివేశారు. మిషన్ భగీరథకు 152 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

You missed