దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రాభ‌వం త‌గ్గిపోతున్న నేప‌థ్యంలో ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ త‌న‌దైన శైలిలో దూకుడు నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. పార్టీకి జ‌వ‌స‌త్వాలు తెచ్చే క్ర‌మంలో ఆమె మార్క్ రాజ‌కీయం, ఆలోచ‌న‌లు, నిర్ణ‌యాలు మ‌ళ్లీ అమల్లోకి వ‌స్తున్నాయి. దీనికి తాజా ఉదాహ‌ర‌ణ పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా సిద్దూని నియ‌మించ‌మే. ఆ రాష్ట్ర సీఎం అమ‌రీంద‌ర్‌కు, సిద్దూకు ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంత వైర‌ముంది. చాలా సంద‌ర్బాల్లో సిద్దూ అమ‌రీంద‌ర్‌తో క‌య్యానికి కాలు దువ్వాడు. త‌ను అనుకున్న‌ది నిర్భ‌యంగా చెప్పేవాడు. ఎవ‌రికి భ‌య‌ప‌డ‌ని మ‌న‌స్త‌త్వం అత‌న్ని ఫైర్‌బ్రాండ్‌గా నిల‌బెట్టింది. సాక్షాత్తు సీఎంతో విభేదాలున్నా సిద్దూనే పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా నియ‌మించ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. అయితే ఈ నిర్ణ‌యం వెనుక సోనియా పార్టీ బ‌లోపేతం విష‌యంలో భ‌విష్య‌త్తును ద్రుష్టిలో పెట్టుకుని స‌మాలోచ‌న‌లు చేసి ఉంటార‌ని భావిస్తున్నారు. ఎవ‌రి వ‌ల్ల పార్టీకి ఉప‌యోగం జ‌రుగుతుందో వారి ప‌క్షాన సోనియా నిలుస్తున్నారు. తెలంగాణ‌లో సైతం పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియ‌మాకం ప‌ట్ల కూడా సోనియా ఇదే వైఖ‌రిని అవ‌లంభించింది. రాష్ట్రాల వారీగా పార్టీ బ‌లోపేతానికి సోనియా కంక‌ణం క‌ట్టుకున్న‌ది. అందులో భాగంగా అక్క‌డ పార్టీ ప‌రిస్థితుల‌ను అవ‌గ‌తం చేసుకుని నాయ‌కుల పై ఒక అంచ‌నాకు వ‌చ్చి వారికి పార్టీ ప‌ద‌వుల‌ను అప్ప‌జెప్పేందుకు త‌న‌దైన ముద్ర‌ను వేసుకుంటున్నారు. మున్ముందు ఆమె కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంది

.

You missed