మేమింతే…! మారమంతే…!! కేసీఆర్ వి అవే అహంకారపూరిత మాటలు..! కేటీఆర్, కవిత కక్ష, పగసాధింపు రాజకీయాలు..!! ఆ ముగ్గురిపై తీవ్ర విమర్శలు.. ఇంకా మారలేదంటూ సెటైర్లు.. దొరహంకారం తగ్గలేదంటూ విసుర్లు…
(దండుగుల శ్రీనివాస్) ఆ ముగ్గురూ ఇంకా మారలేదు. కేసీఆర్ ఇంకా ఫామ్‌హౌజ్ రాజకీయాలే చేస్తున్నాడు. ఆనాడు ఎన్నికల్లో అన్నట్టుగా నన్నోడిస్తే నాకేం నష్టం లేదు. నేను పోయి ఫామ్‌హౌజ్‌లో పంట. మీకే నష్టం. ఇప్పుడచ్చం అట్లనే చేస్తున్నాడు. పైగా నన్నోడించారు కదా…
