హుజురాబాద్ ఎన్నిక ఎప్పుడు ముగుస్తుందో గానీ, సోష‌ల్ మీడియాలో మేథావి వ‌ర్గాల కుమ్ములాట‌లు మాత్రం హ‌ద్దులు దాటుతున్నాయి. వెట‌కారాలు వెర్రిత‌ల‌లు వేస్తున్నాయి. విమ‌ర్శ‌ల ప్ర‌తివిమ‌ర్శ‌ల ఖ‌డ్గ యుద్దాల‌తో ర‌క్త‌మోడుతున్నాయి. హుజురాబాద్‌లో పాద‌యాత్ర చేసి చేసీ అల‌సిపోయి, అస్వ‌స్థ‌త పాలైన ఈట‌ల రాజేందర్‌ను టీఆరెస్ సెక్ష‌న్ వ‌ద‌లడం లేదు. మేథావి వ‌ర్గంగా చెప్పుకుంటున్న వాళ్లు సైతం ఏ మాత్రం అవకాశం దొరికినా.. ఈట‌ల‌ను సెట‌ర్ల బాణాల‌తో గుచ్చి గుచ్చి చంపేందుకు త‌మ మేథోసంప‌త్తినంతా ఫేస్‌బుక్కులో పెట్టి పుల‌కిస్తున్నారు. లైకులు, కామెంట్లు వ‌స్తుంటే వాటిని చూసుకుని పుల‌క‌రిస్తున్నారు. దీనికి ఈట‌ల వ‌ర్గం ఊరుకుంటుందా? ఇంకాస్త గ‌ట్టిగా, మ‌రింత ఘాటుగా స్పందించి త‌మ పైత్యాన్ని కూడా చూపుతున్నారు.

మేమేం త‌క్కువ కాదురోయ్‌.. కాస్కో ఇగ నా వాస్కోడిగామా! అని ఎదురు స‌వాళ్లు విసురుతున్నారు. ఈట‌లకు ఈ రోజు మోకాలి ఆప‌రేష‌న్ అయింది. అది సోష‌ల్ మీడియా ద్వారా అంద‌రికీ తెలిసింది. పోనీ అత‌ని మానాన అత‌న్ని వ‌దిలేస్తే అయిపోయిది. ఫేస్‌బుక్కులో స‌వాల్‌రెడ్డి త‌న వాల్ మీద మోకాలికి ఆప‌రేష‌న్ అయింది క‌దా.. మెద‌డు ఇక స‌రిగ్గా ప‌నిచేస్తుందా? అనే పోస్టు పెట్టాడు. అంటే ఈట‌ల‌కు మెద‌డు మోకాలిలో ఉంది… దానికే క‌దా ఈరోజు ఆప‌రేష‌న్ అయింది.. మ‌రి ఇక‌నైనా మెద‌డు మంచిగా ప‌నిచేస్తుందా? అని అర్థం వ‌చ్చేలా ఉందా పోస్టు. దీనికి అగ్గిమీద గుగ్గిలమైపోయాడు ఈట‌ల అభిమాని సందీప్ ఠాకూర్‌. నీ మెద‌డు మోకాలిలో ఉంది కాబ‌ట్టే నువ్వింకా న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక‌లో ప‌నిచేస్తున్నావు.. స‌వాల్‌రెడ్డి కాదు … నీ త‌ల్లిదండ్రులు పెట్టిన పేరు శ్రీ‌నివాస‌రావు అని పెట్టుకొని ఒరిజిన‌ల్ ఫోటో పెట్టుకో.. మీ కేసీఆర్ మెద‌డు అరికాళ్ల‌లో ఉందా? అని ఇష్ట‌మొచ్చిన‌ట్టు తిట్టిపోశాడు. బండ‌బూతులు తిట్టి సంబ‌ర‌ప‌డిపోయాడు.

అయ్యా.. ఏమ‌న్నా అంటే అన్నారంటారు గానీ, ఊరికే కూసుబుద్ది గాక ఇలా గెలుక్కుని మ‌రీ తిట్టించుకోవ‌డం మీకు స‌మ్మ‌గా ఉంటుంద‌నుకుంటా కాబోలు. ఈట‌ల మోకాలితో మీకేలా సారు? మ‌ధ్య‌లో మా న‌మ‌స్తే తెలంగాణ ఏం పాపం చేసింది. ? దాన్నెందుకు తిట్టిపోస్తున్నారు.? ఇది మ‌రీ అన్యాయం కాక‌పోతే మా కేసీఆర్ సారు ఏం చేశాడ‌య్యా మీకు. ఆయ‌న్నూ ఆడిపోసుకోవాలా? మోకాలి నుంచి అరికాళ్ల‌
కు తెస్తారా మెద‌డు? ఇంకా పాతాళంలోకి తీసుకుపోయేదేమైనా ఉందా?
మీరూ మీ పైత్యం కాక‌పోతే… మీ మేథ‌స్తు.. తెలివితేక‌ర‌లు మాకు మాబాగా తెలుసుగానీ జెర్ర ఓపిక‌లు ప‌ట్టుర్రి. మేథ‌స్సు గుమ్మ‌రిద్దామ‌నుకుని మెద‌డే లేద‌నే విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టుకుంటే మ‌రీ ప్ర‌మాదం సుమీ..!!

You missed