కార్యనిర్వాహక అధ్యక్షుడే కార్యకర్త లాగా కష్టపడుతుంటే కార్యకర్తలు ఎంతటి ఉత్సాహంతో కథనరంగంలోకి దూకుతారో కదా.. అదే సమరోత్సాహం మంగళవారం కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి, కామారెడ్డి మండలాల్లోని టిఆర్ఎస్ శ్రేణుల్లో కనిపించింది. కారణం టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయారే ఏకంగా 10 గంటల పాటు కార్యకర్తల సమావేశాల్లో కార్యకర్త లాగే పార్టీ గెలుపు కోసం శ్రమించడం.
కామారెడ్డి నుంచి పార్టీ అధినేత కెసిఆరే పోటీకి దిగనుండడంతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామారెడ్డి జిల్లాలో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంలో భాగంగా మంగళవారం కామారెడ్డి, మాచారెడ్డి మండలాల టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశాల్లో పాల్గొన్నారు. కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తూ.. లోటుపాట్లను సరిదిద్దడంలో కార్యకర్తల సూచనలను పరిగణలోకి తీసుకుంటూ సమావేశంలో లోతైన సమీక్ష చేస్తూ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చర్చిస్తూ దిద్దుబాటు చర్యలు చేపట్టారు కేటీఆర్.
ఇలా వారి మధ్య పది గంటలపాటు ఉండి క్యాడర్‌ను కార్యోన్ముఖుల్ని చేశారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. 10 గంటల పాటు కార్యకర్తలతో కలిసి కార్యకర్త మాదిరిగా వర్క్ చేసే వర్కింగ్ ప్రెసిడెంట్ తమ పార్టీ సొంతమని కార్యకర్తలు గర్వంగా మాట్లాడుకోవడం వినిపించింది. కేటీఆర్ అలా ఉదయం 11 గంటలకు కార్యకర్తల మధ్య తన విధిని కర్తవ్యాన్ని ప్రారంభించి రాత్రి 9 గంటల వరకు నిర్వర్తించడం వల్ల వచ్చిన ఫలితం కార్యకర్తల్లో సమరోత్సహం.. సంపూర్ణ భరోసా.