కామారెడ్డి పై కేటీఆర్‌ నజర్‌తో అక్రమాల పాములు పుట్టల నుంచి బయటకు వస్తున్నాయి. కేటీఆర్‌ దెబ్బకు కామారెడ్డిలో అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన గడ్డం చంద్రశేఖర్‌రెడ్డికి శుభంకార్డు పలికాడు రామన్న. ఎన్నిసార్లు వార్నింగ్‌ ఇచ్చినా మారలేదు. పైగా అవే బెదిరింపులు.. తిరుమల్‌రెడ్డిని ఇటీవల దుర్బాషాలాడుతూ గలాటకు దిగడంతో ఈ విషయం హైదరాబాద్‌కు పొక్కింది. దీంతో మరింత సీరియస్‌ అయ్యారు కేటీఆర్‌.

సోమవారం కేటీఆర్‌ గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి పార్టీని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం తీవ్ర కలకలం రేపింది. కామారెడ్డిలో ఇప్పుడిది హాట్‌ టాపిక్‌. గత కొంతకాలంగా కేటీఆర్‌ కామారెడ్డిపై సీరియస్‌గా దృష్టి పెట్టారు. అక్రమ నేతలపై, గ్రూపు రాజకీయాలపై సీరియస్‌ వార్నింగ్ ఇచ్చారు. అయినా మార్పు లేదు. గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి రియల్‌ వ్యాపారాలు చేస్తూ అక్రమాలకు తెగపాల్పడుతున్నాడు. అడిగిన వారిని బెదిరించడం పరిపాటిగా మారింది. ఈ వేటుతో ఒక్కసారిగా కామారెడ్డి బీఆరెస్‌లో అలజడి మొదలైంది…

You missed