వాస్తవంలో కాడెత్తేసిన నేతలని వచ్చిన వార్త కథనాన్ని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సీరియస్‌గా తీసుకున్నాడు. వెంటనే ఢిల్లీ పయనమయ్యాడు. తనకు టికెట్‌ ఇవ్వాల్సిందేనని అధిష్టానాన్ని పట్టుబడుతున్నాడు. ధర్మపురి సంజయ్‌ను అడ్డుకున్నాడు. తాజాగా ఆకుల లలితనూ రానీయలేదు. ఓ మైనార్టీ నేతకు ఇచ్చి చేతులు దులుపుకుందామని అనుకున్నాడు. కానీ నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో రెండు బీసీలకు ఇవ్వాలని పార్టీ యోచించింది.

అందులో అర్బన్‌, ఆర్మూర్‌ ఉన్నాయి. ఆర్మూర్ వినయ్‌రెడ్డికి ఇచ్చేశారు. ఇక మిగిలింది అర్బన్‌ ఒక్కటే. మొదట నుంచి మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తను అర్బన్‌ నుంచి పోటీ చేయాలనుకున్నా.. అధిష్టానం ఒప్పుకోలేదు. సర్వేలో తనకు అనుకూలంగా రాకపోవడమే కారణం. ఇదే విషయాన్ని పరోక్షంగా ఆయన మొన్నటి ప్రెస్‌మీట్‌లో తను నియోజకవర్గానికే పరిమితం కాదలుచుకోలేదని, అధిష్టానం ఒప్పుకోవడం లేదని ఏదేదో చెప్పాడు. ఇదే విషయాన్ని ‘వాస్తవం’ కాడెత్తేసిన నేతలు అనే శీర్షికన వార్త రాసింది.

అర్బన్‌ కాంగ్రెస్‌ను మహేశ్‌ అనాథను చేశాడనేది ఆ వార్త కథనం సారాంశం. ఈ దెబ్బతో మహేశ్‌ ఢిల్లీ పయనమయ్యాడు. టికెట్‌ కోసం శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. అతను అనుకంటే టికెట్‌ కచ్చితంగా వస్తుందని పార్టీ శ్రేణులు చెబుతున్నా.. మరి ఎందుకింత ఆలస్యమయ్యింది…? అనేది అందరికీ తెలుసు. మొత్తానికి అందరినీ తరిమేసి మహేశ్‌ మాత్రం మళ్లీ అర్బన్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడా..? అదే జరగేలా ఉంది.

 

 

You missed