ఆ ఇద్దరు నేతలు సీనియర్లు. రాష్ట్ర స్థాయి లీడర్లు. పార్టీ ఎదుగుదలకు, గ్రాఫ్‌ పెరిగేందుకు వీరు చేసిందేమీ లేదు. ప్రజల్లో ఊపు దానంతట అదే వచ్చింది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు మరింత బలాన్నిచ్చాయి పార్టీకి. ఇక మాకు తిరుగులేదనుకున్నారు ఈ ఇద్దరు నేతలు. కానీ కాలం కలిసిరాలేదు. ఇద్దరు చివరి నిమిషంలో కాడెత్తేశారు. వారే బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, షబ్బీర్‌ అలీ. అర్బన్‌ నుంచి తనకే టికెట్ కావాలని మొండి పట్టు పట్టి ఎవరినీ రానీయలేదు మహేశ్‌. ధర్మపురి సంజయ్‌ను అడ్డుకున్నాడు. ఆకుల లలితను కూడా ఇదే విధంగా అడ్డుకున్నాడు.

కనీసం ఆమెను పార్టీలోకి కూడా చేరనీయకుండా కత్తి కట్టాడు. కానీ చివరకు ఎవరినీ రానీయకా.. తనూ పోటీ చేయక.. తప్పుకుంటున్నట్టు ప్రటకించేశాడు. దీంతో అర్బన్‌ అనాథగా మారింది. ఇవాళ జరగాల్సిన రాహుల్‌ సభ రద్దు కావడానికి ఈ నేతే కారణంగా చెప్పవచ్చు. ఇక షబ్బీర్‌ అలీ కూడా అంతే. ఈసారి కామారెడ్డి నుంచి తను గెలుస్తున్నానని అనుకున్నాడు. కానీ అనూహ్యంగా అక్కడ సీఎం కేసీఆర్‌ పోటీ అనే సరికి వెనక్కి తగ్గాడు. వరుసగా పరాజయం చవిచూస్తున్న షబ్బీర్‌కు మళ్లీ ఓటమే స్వాగతం పలకనుందని తెలిసిపోయింది.

దీంతో అర్బన్‌, ఎల్లారెడ్డి, జూబ్లీహిల్స్‌ అంటూ ఏవేవో అభ్యర్థనలు అధిష్టానం ముందుంచుతున్నాడాయన. వీరిద్దరి వైఖరితో పార్టీ క్యాడర్‌లో ఆత్మస్థైర్యం దెబ్బతింటున్నది. పెరిగిన పార్టీ గ్రాఫ్‌ కాస్త పడిపోతున్నది. మాదే గెలుపు అనే ధీమాగా ఓ కామెంట్‌ చేసి బరిలో నిలిచే ధైర్యం లేక వ్యక్తిగతంగా వెనుడుగు వేసి కాళ్లకు బుద్ది చెప్పిన ఈ నేతల తీరు పార్టీకి గొడ్డలి పెట్టులా మారింది.

You missed