బీజేపీ అభ్యర్థుల మొదటి లిస్టు రేపు (శనివారం) విడుదల కానున్నది. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో ఐదింటిని ఓకే చేశారు. కోరుట్ల, బోధన్ పెండింగ్‌లో పెట్టారు. కోరుట్లలో అర్వింద్ పోటీ చేసేందుకు రెడీ అయ్యాడు. దాదాపు అతనికే కోరుట్ల టికెట్ ఫైనల్ అయ్యింది. బోధన్‌లో మోహన్‌రెడ్డి, మేడపాటి ప్రకాశ్‌రెడ్డి ల విషయంలో పీటముడి పడింది. మరోసారి సర్వే చేయిస్తున్నట్లు తెలిసింది. మేడపాటికి సర్వే ఫలితాలు మొగ్గు చూపుతున్నాయి.
ఈ రెండు రెండో లిస్టులో ఫైనల్ కానున్నాయి. నిజామాబాద్ అర్బన్ ధన్‌పాల్ సూర్యనారాయణకు ఓకే అయ్యింది. బాల్కొండ అన్నపూర్ణమ్మ, ఆర్మూర్ పైడి రాకేశ్‌రెడ్డి, నిజామాబాద్ రూరల్ కులాచారి దినేశ్, జగిత్యాల భోగ శ్రావణిల పేర్లు ఖరారయ్యాయి. ఈ పేర్లే మొదటి లిస్టులో రానున్నాయి. కామారెడ్డి జిల్లా పరిస్థితి అయోమయంగా ఉంది. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండంటంతో వెంకటరమణారెడ్డి గెలుపు ఆశలు అడియాశలయ్యాయి. దీంతో ఇక్కడ నుంచి కేసీఆర్‌తో తలపడే పెద్ద తలకాయలను దించాలని అధిష్టానం భావిస్తోంది. బండి సంజయ్ లేదా విజయశాంతిని కామారెడ్డి బరి నుంచి దించాలనే యోచనలో ఉన్నట్టు తెలిసింది.
ఇక ఎల్లారెడ్డిలో క్యాండిడేట్ లేడు. ఏనుగు రవీందర్‌రెడ్డి బీఆరెస్‌లో చేశాడు. బాన్సువాడ నుంచి సీనియర్ నేత యెండల లక్ష్మీనారాయణకు ఇద్దామనుకుంటున్నారు. లేదంటే మాల్యాద్రి రెడ్డికే టికటె్ చాన్స్ ఉంది. జుక్కల్ బరి నుంచి అరుణతార, మరో ఎన్నారై ఆశిస్తున్నాడు. వీరిలో ఎవరికో క్లారిటీ లేదు. మొత్తానికి కామారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు పెండింగ్‌లో ఉంచనున్నారు. రెండో లిస్టులో ఇవి విడుదల కానున్నాయి.