నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ కోలుకున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. నిర్విరామంగా తన నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు, కార్యక్రమాలు చేసిన ఆయన వైరల్ ఫీవర్‌కు గురయ్యారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో అడ్మిట్ అయ్యి కొన్ని రోజులుగా చికిత్సలు తీసుకుంటున్నారు. ఇవాళ ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఎమ్మెల్సీ కవిత బాజిరెడ్డిని పరామార్శించారు.
ఆదివారం సీఎం కేసీఆర్ సిట్టింగులందరికీ బీ ఫారాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి బాజిరెడ్డి హాజరుకానున్నారు. ఆ తర్వాత యథావిధిగా నియోజకర్గంలో ప్రచార కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘వాస్తవం’ ప్రతినిధితో మాట్లాడారు. తను పూర్తిగా కోలుకున్నానని, తిరిగి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు.