కాంగ్రెస్‌ మొదటి లిస్టు ఆదివారం విడుదల కానుంది. దాదాపు 60 నుంచి 70 సీట్లను ప్రకటించునున్నారు. మలి విడత జాబితాను బస్సు యాత్ర అనంతరం ప్రకటించనున్నారు. నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా నుంచి బోధన్‌ మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, బాల్కొండ ముత్యాల సునీల్‌రెడ్డి, కామారెడ్డి షబ్బీర్‌ అలీల పేర్లు రానున్నాయి. నిజామాబాద్‌ విషయానికి వస్తే నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌, ఆర్మూర్‌ నియోజకవర్గాలను పెండింగ్‌లో పెట్టనున్నారు.

నిజామాబాద్ అర్బన్‌ నుంచి ఆకుల లలిత ప్రయత్నం చేసుకుంటున్నది. ఇది పెండింగ్‌లో ఉన్నది. ఆర్మూర్‌ నుంచి మహేశ్‌ గౌడ్‌, మధుయాష్కీలు ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఇస్తే వినయ్‌ రెడ్డి లేదా బీసీ కోటాలో మహేశ్‌ కుమార్ గౌడ్‌లకు ఇవ్వనున్నారు. రూరల్‌లో ముగ్గురూ ముగ్గురే. మధ్యలో మండవ పేరు కూడా వస్తోంది. కానీ ఆయన తను కాంగ్రెస్‌లోనే కాదు ఏ పార్టీలో చేరనని రాజకీయాలకు దూరంగా ఉంటానని చెబతూ వస్తున్నారు. ఇదీ పెండింగ్‌లో ఉంది. ఎల్లారెడ్డి, బాన్సువాడ కూడా పెండింగ్‌లో పెట్టనున్నారు. జుక్కల్‌ సౌదాగర్‌ గంగారం పేరు ప్రకటించనున్నారు.

You missed