ఎన్నికల వేళ బీజేపీ తన అధికార సత్తా చాటుకున్నది. ఈసీతో ఐపీఎస్‌ల బదిలీలకు పాల్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఈసీ బుధవారం రాత్రి అనూహ్య , సంచలన నిర్ణయం తీసుకున్నది. ఇందులో నిజామాబాద్‌ సీపీ కూడా ఉండటం గమనార్హం. సీపీ సత్యనారాయణ వచ్చి కొన్నాళ్లే అయ్యింది.అయినా ఈసీ ఝలక్‌ ఇచ్చింది. దీని వెనుక బీజేపీ ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోనే ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నదనేది జగమెరిగిన సత్యం.

ఇక్కడి బీజేపీ నేతలు ఇచ్చిన సమాచారంతోనే కేంద్ర హోం మినిష్టర్‌ అమిత్‌ షా ఈసీని ఆదేశించింది. దీంతో ఈసీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. వాస్తవంగా ఎన్నికల వేళ అధికార పార్టీ ఏరికోరి సీపీలను వేయించుకుంటుంది. నిజామాబాద్‌ జిల్లాలో కూడా ఇదే జరిగింది. ఇక్కడి బీజేపీ నేతలు ఈ సమాచారాన్ని కేంద్రానికి ఇచ్చారు. దీంతో ఈసీ చేత నిజామాబాద్‌ సీపీని బదిలీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. రేపో, ఎల్లుండో కొత్త సీపీ జిల్లాకు రానున్నాడు. ఎన్నికల వేళ ఇందూరు జిల్లాలో ఇది బీఆరెస్‌ నేతలకు షాక్‌లాంటి వార్తేనని చెప్పాలి.

 

You missed