జిల్లా బిజెపి నేతలు, అరవింద్ టీం ప్రధానమంత్రి తో పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన చేయించాక రాజకీయ పరిణామాలపై, బోర్డు విషయంలో.. ముఖ్యంగా ఎన్నికల వేళ ప్రకటన చేసిన నేపథ్యంలో రైతులు పెదవి విరుస్తున్న అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీస్తున్నట్లు సమాచారం. పది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పసుపు బోర్డు సాధ్యం కాదని, ఇదే అంశం ఎన్నికల్లో వాడుకొని గత నాలుగేళ్లుగా పసుపు బోర్డు ఇచ్చామని, తీరా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని మళ్లీ ఎన్నికల వేళ ప్రకటనలు చేయడం రైతుల్లో ప్రధాని ప్రకటనపై విశ్వసనీయతను నింపినట్లు కనిపించట్లేదు అనే చర్చ సర్వత్రా జరుగుతున్నది. ఎన్నికల వేళ ప్రధానమంత్రి చేసిన ప్రకటన రైతులను మరోసారి వంచించడమే అనే చర్చను బల్లగుద్ది విడదీసే అస్త్రంగా మార్చి బిజెపి పైనే తిరిగి ప్రయోగించే వ్యూహానికి పదునుపెట్టే యోచనతో కెసిఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి ప్రకటన అనంతరం క్షేత్రస్థాయిలో పరిణామాల పై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

పసుపు బోర్డు కోసం రాష్ట్రంలో, జాతీయస్థాయిలో టిఆర్ఎస్ చేసిన కృషి ప్రజల్లో చెప్పుకోదగ్గ ఘనతగా ఉన్నందున.. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ పసుపు బోర్డు అంశంపై చేతులెత్తేయడాలు, బాండ్ పేపర్ సాక్షిగా ఒకటి చెప్పి మరోలా చేయడం, తిరస్కరణలు, బోర్డు పట్ల రైతులకు ఉన్న ఆకాంక్షను అవహేళన చేస్తూ పోలికలు చేయడం, ఎన్నికల వేళల్లో మాత్రమే పసుపు బోర్డు పై ప్రకటనలు చేయడం లాంటి అననుకూలతలు బిజెపి కి ఉన్నందున పసుపు బోర్డుపై ప్రధానమంత్రి ప్రకటన అంశాన్ని ఎండగట్టే అవకాశాన్ని వదిలేదే లేదు అని పెద్దాయన డిసైడ్ అయ్యారని సమాచారం.

You missed