శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లోంచి దిగువకు గోదావరిలోకి అదనపు వరద విడుదల మళ్లీ చేపట్టారు. ఎస్సారెస్పీ కొద్దిరోజులుగా 100% నిండుగా ఉంది. ప్రాజెక్టు పరిధిలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు వల్ల ప్రాజెక్టులోకి ఆదివారం మధ్యాహ్నం నుంచి వరదరాక కాస్త పెరిగింది. రాత్రి 7 గంటలకల్లా వరదరాక 78 వేల 100 క్యూసెక్కులకు పెరగడంతో వచ్చిన వరదలు వచ్చినట్లు బయటకు వదలచిన పరిస్థితి నెలకొంది.

దీంతో ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు ప్రాజెక్టు 16 గేట్లను ఎత్తి 49 వేల 890 క్యూసెక్కుల అదనపు వరదను గోదావరి నదిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు వరద కాలువ ద్వారా సైతం 15 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నది పరివాహక ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా రైతులు, చేపలు పట్టేవారు, పశువుల కాపరులు నదీ వరదలోకి దిగకూడదని అధికారులు హెచ్చరించారు.

You missed