ఆర్మూర్‌ ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువే. అది ఏ పార్టీ అయినా. ఏ ఇష్యూ అయినా. ఇప్పుడు కాంగ్రెస్‌ వంతు వచ్చింది. ఆగి ఆగి ఎలాగోలా రేవంత్‌ సమక్షంలో గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నాడు బీజేపీకి గుడ్‌ బై చెప్పిన పొద్దుటూరి వినయ్‌రెడ్డి. ఏకంగా రేవంత్‌ రెడ్డి ఆ మీటింగులో దాదాపుగా వినయ్‌రెడ్డి పేరును ప్రకటించేశాడు. సర్వేలన్నీ వినయ్‌కు అనుకూలంగా ఉన్నాయని, మీ అభ్యర్థి ఇతనేననే విధంగా మాట్లాడటంతో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మొదలుకొని అంతా భగ్గుమన్నారు చీఫ్‌ చీప్‌ మాటలకు.

ఇదేం వైఖరి. ఇప్పుడే అభ్యర్థుల పేర్లు ఎలా ప్రకటిస్తావు..? ఇందులో మతలబేమిటీ.? లోపాయికారి ఒప్పందమా..? రెడ్లకే అగ్రతాంబూలం ఇచ్చేందుకు కంకణం కట్టుకున్నావా..? ఇగో ఇలా కామెంట్లు ఆ పార్టీలోనే. ఇది చినికి చినికి గాలివానలా మారినట్టు పెద్ద దుమారమే రేపుతోంది. సుదర్శన్‌రెడ్డికి వినయ్‌రెడ్డి బంధువు కావడం వల్ల కూడా రేవంత్‌ ఇలా డిక్లేర్‌ చేశాడా..? సర్వే రిపోర్టు ఎప్పుడు చేశాడు..? ఎప్పుడు వచ్చింది..? మొన్ననే కదా వినయ్‌ దరఖాస్తు చేసుకున్నది…? మరి ఇలా ఎలా ప్రకటిస్తాడు…? ఇది పార్టీ సిద్దాంతాలకు, నిబంధనలకు విరుద్దం కాదా…? రేవంత్‌పై విమర్శలు, ప్రశ్నల వర్షంతో పాటు తిట్ల దండకాన్ని కూడా అందుకున్నారు ఆ పార్టీ నేతలు. వినయ్‌ తన పేరును చీఫ్‌ ప్రకటించాడని ఆనందం కొద్ది క్షణాలే. పార్టీలో వచ్చిన వ్యతిరేక మాటలు, తిట్లు ఆ ఆనందాన్ని కాస్తా తుడిచిపెట్టేశాయి. ఇదో కొత్త వివాదం. రేవంత్‌కు అలవాటైన దోరణే కదా. తనకు తాను ఇది తన సొంత పార్టీ, ప్రాంతీయ పార్టీగా భావిస్తాడు కాబోలు… అలా తన సొంత అభిప్రాయాలను, లోపాయికారి లాభాలను పరిగణలోకి తీసుకుంటాడంతే.. నో మోర్‌ కండిషన్స్‌….. అంటూ వెటకార వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్నారు ఇందూరు పార్టీ హస్తం నేతలు.

 

 

You missed