ఏకగ్రీవ తీర్మానాలంటూ కుల సంఘాలన్నీ అధికారపార్టీ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. ఇది కామనే. షరా మామూలే. ఎన్నికల సమయం రాగానే ఇలా సంఘాలకు సంఘాలు తీర్మానాలు చేసేసుకుంటూ ఉంటాయి. నేతలకు కలుస్తూ ఉంటారు. దీని వెనుక తమ డిమాండ్ల చిట్టాను కూడా ఏకరువు పెడతారు. అనుకున్నది చేసేసుకుంటారు. సరే… ఇదంతా చూశాం. చూస్తున్నాం.. కానీ ఇప్పుడు చెప్పబోయేది అంతకు మించి అన్నట్టు. ఏకగ్రీవ తీర్మానం చేయడమే కాదు.. వాళ్ల ఊర్లో ఏ పార్టీ జెండా ఎగరొద్దంట… కనీసం ప్రచారాని ఊరికి కూడా రావొద్దంటా…ఇదేం వింత తీర్మానమో.. విచిత్ర నిర్ణయమో గానీ….ఇందులో అతి మరీ మితిమీరి పోయినట్టు లేదు. తమ నేతను ప్రసన్నం చేసుకునేందుకు మరీ ఇంతలా చాగిలా పడి పొర్లుదండాలు పెట్టాలా..? ఏమో .. ఎన్నికలు దగ్గర పడ్డా కొద్దీ ఇంకెన్ని వింత విచిత్ర వికార నిర్ణయాలు,తీర్మానాలు చేస్తారో…. ఏదేమైనా నేతలు మాత్రం ఇదే కోరుకుంటున్నారు. అందుకే ఇలా హద్దులు దాటిన అభిమానం అభాసుపాలవుతోంది…

ఇగో ఇలా… మీరే చదవండి…

 

బాన్సువాడ శాసనసభ నియోజకవర్గం భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి గారికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన రుద్రూరు మండలం రాణంపల్లి గ్రామం.

స్వగ్రామం పోచారం లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఈరోజు కలిసిన రాణంపల్లి గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు, కుల సంఘాల పెద్దలు, గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానాన్ని అందజేశారు.

తమ గ్రామానికి రోడ్డు, మంచినీటి సౌకర్యం, డబుల్ బెడ్ రూం ఇళ్ళతో పాటుగా పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇంతటి అభివృద్ధి కేవలం పోచారం శ్రీనివాసరెడ్డి గారితోనే సాధ్యం అని తెలిపిన గ్రామస్తులు.

పోచారం శ్రీనివాసరెడ్డి గారికి బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి MLA గా పోటీ చేసే అవకాశం కల్పించిన BRS పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు.

గులాబీ జెండా తప్ప తమ గ్రామంలో వేరే జెండాలకు అనుమతి లేదని, ఎన్నికల ప్రచారం కోసం వేరే పార్టీల అభ్యర్థులు తమ గ్రామానికి రావద్దని గ్రామస్తులు స్పష్టం చేశారు.

 

You missed