కామారెడ్డి బీజేపీ నేత కాట్‌పల్లి వెంకటరమణారెడ్డి నమస్తే తెలంగాణ యాజతమాన్యానికి లీగల్‌ నోటీసులు ఇచ్చారు. కామారెడ్డి విలేకరి తను మాట్లాడిన మాటలను వక్రీకరించి రాసిన విషయంలో వెంకట రమణారెడ్డి సీరియస్‌ అయ్యాడు. ప్రెస్‌మీట్‌లో ఆ విలేకరిపై తీవ్రంగా మండిపడ్డాడు. జీతం రాళ్ల కోసమే నీవు ఇలా తప్పుడు వార్తలు రాస్తే నా దగ్గర జీతం ఉండు.. నీకు జీతమిస్తా అంటూ పరుషంగా వ్యాఖ్యానించడంతో మీడియా యూనియన్లు రమణారెడ్డిపై మండిపడ్డారు.

అయినా అతను వెనక్కి తగ్గలేదు. వేరే పేపర్లో ఎలా రాశారు..? నమస్తేలోనే ఎందుకు ఇలా రాశాడు..?? నిరూపించండి.. నాది తప్పైతే వందసార్లు క్షమాపణ చెబుతా అంటూ తిరిగి కౌంటర్‌ ఇవ్వడమే కాదు.. నమస్తే తెలంగాణ ఎండీకి, ఎడిటర్‌కు, బ్యూరోకు లీగల్‌ నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. ఇదిప్పుడు చర్చనీయాంశమైంది.

You missed