ఉద్యమ నేత మనసున్న నాయకుడు కేసీఆర్ను 23 సంవత్సరాలుగా నమ్ముకొని బతుకుతున్న కుటుంబం మాది అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రితో తమ కుటుంబానికి ఉన్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తుచేసుకొని కెసిఆర్ పట్ల తన విశ్వసనీయతను, విధేయతను వ్యక్తం చేశారు. బుధవారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ కేంద్రమైన బాల్కొండ పట్టణంలో నూతనంగా మంజూరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన కెసిఆర్ కుటుంబంతో తమ కుటుంబానికి ఉన్న తరతరాల ప్రేమ, అనుబంధాన్ని ఆవిష్కరించారు. కెసిఆర్ ఆదరణ.. కెసిఆర్ తో సాన్నిహిత్యం కారణంగానే తాను తనను ఎన్నుకున్న బాల్కొండ నియోజకవర్గానికి ఇంత భారీ స్థాయిలో అభివృద్ధిని అందించగలుగుతున్నానని మనసు నిండా మరోసారి చెప్పుకున్నారు. కెసిఆర్ తో తనకు ఇంత ఆత్మీయ సాహిత్యం ఉన్నా.. ఏనాడు ఈ సాన్నిహిత్యాన్ని తన సొంతం కోసం వాడుకోలేదన్నారు. తన బాల్కొండ నియోజకవర్గం కోసమే వినియోగించుకున్నాను అన్నారు. అందువల్లనే కేసీఆర్ ఆశీస్సులతో ఇంతటి అభివృద్ధిని అందించగలుగుతున్నానని స్పష్టం చేశారు. తన తండ్రి వేముల సురేందర్ రెడ్డి.. తర్వాత తాను ఇదేవిధంగా కేసీఆర్ తో ఉన్న ఆత్మీయతను ప్రజల కోసమే వినియోగిస్తున్నామని చెప్పారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు సూటిగా చక్కని సందేశాన్ని ఇచ్చారు. డబ్బు కన్నా విద్యనే గొప్పదని గుర్తుంచుకోవాలని సూచించారు. విద్యనే శాశ్వతమన్నారు. ఇందుకు తన, తన తండ్రి జీవితాల్లోని అనుభవాలే నిదర్శనాలుగా వివరించారు. తన తండ్రి వేముల సురేందర్ రెడ్డి కి 100 ఎకరాల భూములు ఉండేవని.. ఆయన రాజకీయ పయనంలో, పెద్దదైన కుటుంబ వ్యయ బాధ్యతల్లో కాలక్రమేనా ఆ భూములన్ని హారతి కర్పూరం లా కరిగిపోయాయని చెప్పారు. తాను సైతం తాను చదువుకున్న సివిల్ ఇంజనీరింగ్ విద్యను నమ్ముకుని 1990 సంవత్సరంలో కేవలం ఎనిమిది వందల రూపాయల జీతానికే పనిచేశానని వివరించారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అలా తాను నమ్ముకున్న విద్యనే తనను నిలబెట్టిందని.. బిల్డర్ గా ఎదిగి డబ్బు కలిగినవాడిగా నిలబెట్టిందని చెప్పారు. ఆ విద్యతోనే నేర్చుకున్న నాలెడ్జితో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చేపట్టిన చారిత్రక నిర్మాణాలను విజయవంతం చేస్తూ కేసీఆర్ వద్ద సక్సెస్ నేమ్ తెచ్చుకోగలిగానని అన్నారు. ఆ సక్సెస్ నేమ్ తనపై కేసీఆర్ కు నమ్మకాన్ని పెంచిందన్నారు. ఇదంతా విద్య.. విద్య ద్వారా అంది జ్ఞానము నైపుణ్యము ద్వారానే సాధ్యపడిందన్నారు.

You missed