జర్నలిస్టులంటే ఎంతటి మర్యాదో కదా సమాజంలో. ఒకడు చంపుతానంటాడు.. ఒకడు ఒరేయ్‌ జీతముండరా ముండాకొడకా.. అనంటాడు. ఇంకొకడు ఏకంగా దాడే చేయిస్తాడు. ఎక్కువ మాట్లాడే ఆ పార్టీ నేతతో ఆ పార్టీ పత్రికలోంచి జీతం ఊడగొట్టించి రోడ్డున పడేస్తాడు… ఇంతటి మంచి, మర్యాద రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్న క్రమంలో.. డిజిటల్‌ అవతారమెత్తి మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా కూడా ప్రింటింగ్‌ మానేసేకుని మూసుకుంటున్న సందర్బంలో.. జర్నలిస్టు అనే వాడికి సోయి ఉండొద్దా అని పాలకుడు గుర్తు చేసి… ప్రశ్నిస్తే మీకు ప్లాటే ఇయ్యమని తెగేసే చెబుతున్న శుభ ముహూర్తంలో… ఆంధ్రప్రభ మేనేజ్‌మెంట్‌కు ఓ మహత్తర, అద్బుత, అంధవికార, అథఃపాతాళ ఆలోచనొకటి వచ్చింది.

అసలు జర్నలిస్టంటే ఎవడు..? ఫీల్డుకు వెళ్లాలి… అన్వేషించాలి… నిజాలు రాయాలి. కదా..! పాపం సదరు ఆంధ్రప్రభ కూడా ఇదే చెప్పిందండి.. ఎందుకు ఆడిపోసుకుంటారు అనుకోకండి అప్పుడే. కొంచెం గొడ్డుకారం కలిపి కొట్టింది. అందుకే ఈ వెటకారం. ఫీల్డుకు వెళ్లి ఆ రిపోర్టరు ఓ సెల్ఫీ దిగాలట. అది సదరు హెడ్‌ గారికి పంపాలట. అప్పుడే వారు నిఖార్సయిన, నిక్కచ్చి, నిజాయితీ, నిజమైన, అడ్డమైన, పొడుగైన, పొదుపైన, అసలైన, సిసలైన, జీవితం సంకనాకిచ్చుకున్న విలేకరి అని మర్యాద ఇచ్చి సత్కరిస్తారట. ఇదండీ విషయం. ఇచ్చేవి భారీ జీతాలాయే మరి. జాబ్‌ గ్యారెంటీ కూడా ఉండనే ఉంది. ఎంతో విలువ సమాజంలో. మరి ఇన్ని ప్లస్‌ పాయింట్లు ఉండగా.. ఇంట్లో కూసుని సుక్కేసుకుంటూ ముక్క కొరుక్కుంటూ రిపోర్టింగ్‌ చేస్తానంటాడా..? అసలు వాడు విలేకరేనా…? విలేకరంటే నిత్య విద్యార్థి.. అలా ఎప్పుడూ రోడ్లపై తిరుగుతుండాలె.. అప్పుడే ఎన్నో కొత్త విషయాలు తెలిసేవి. కరెక్టే మాస్టరు.. మీరు సూపరు..! మీలాంటి వారుండాలి. మీడియాకు మర్యాద మనన్నలు మస్తుగా పెరగాలి. ఇంకా. ఇలా…

You missed