రాజకీయం అంటే అదే మరి. నేనొక్కడినే అంటే కుదరదు. కలుపుకుపోవాలి. కాలం కలిసిరావాలి. కలిసిపోవాలి. అసమ్మతి నేతలనూ కలవాలి. దీనికి మంచి ముహూర్తం కూడా కుదరింది. ధర్మపురి సంజయ్ ఈనెల 29న తన నివాసంలో మహా చండీయాగం చేస్తున్నాడు. దీని కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలో తనొంటరే నిన్నటి వరకు. ఈ మహాచండీ యాగంతో ఆయన అందరినీ కలిశాడు. జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, నగర అధ్యక్షుడు కేశవేణు.. ఇలా.
రండి మిత్రులారా… వచ్చి అమ్మ దీవెనలు తీసుకోండని ఆహ్వానించాడు. అర్బన్ నుంచి టికెట్ ఆశిస్తున్న సంజయ్ సోమవారం కాంగ్రెస్‌లో తనకు దూర దూరంగా ఉంటున్న నేతలకు స్వయం వెళ్లి కలిశాడు. పిలిచాడు. తప్పుదు మరి. మొన్నటి వరకు ఫ్లెక్సీలపై ఎవరి ఫోటోలు కూడా పెట్టేందుకు ఇష్టపడని సంజయ్.. తన పంథా మార్చుకున్నాడు. అందరికీ కలుపుకుపోతున్నాడు. మహా చండీయాగం వేదికగా.