ఆకుల లలిత బీఆరెస్‌ పార్టీలో అలక వహించిన నాయకురాలు. తనకు ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి రెన్యూవల్‌ చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారని గత కొద్దికాలంగా గుస్సాగా ఉన్నది. అర్బన్‌ కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఇస్తే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని కూడా భావించింది. కానీ ఎమ్మెల్సీ కవిత రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. శుక్రవారం ఆర్మూర్‌లో జీవన్‌రెడ్డి ప్రజాశీర్వాద యాత్రకు ఆమెను తీసుకువచ్చారు.

కవితతోనే ఆ ర్యాలీ సభలో ఆమెకు తిరిగి ఎమ్మెల్సీ పదవి ఇస్తామనే హామీనిచ్చారు కవిత. ఉమెన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పదవి ఇచ్చినా దీని పట్ల ఆమెకు ఏ మాత్రం సంతోషం లేకుండె. భార్యభర్తలిద్దరూ తీవ్ర అసంతృప్తితోనే రగిలిపోతూ వస్తున్నారు. చివరకు పార్టీని వీడేందుకూ సిద్దమయ్యారు. దీన్ని గమనించిన అధిష్టానం కవితకు చక్కదిద్దే బాధ్యతలు అప్పగించారు. కవిత ఈ అంశంలో ఎంట్రీ ఇచ్చి లలితను బుజ్జగించారు. ఆర్మూర్‌తో పాటు అర్బన్లో కూడా ఆమె సిట్టింగు అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని, ముందిచ్చిన మాట ప్రకారం మళ్లీ తిరిగి ఎమ్మెల్సీని చేస్తామనే కమిట్‌మెంట్‌ కూడా ఇచ్చినట్టు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీన్ని నిజం చేస్తూ ఇవాళ ఆర్మూర్‌లో కవిత లలితకు ఉన్నత పదవి వరిస్తుందని పరోక్షంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవిని తిరిగి కట్టబెడతామనే సంకేతమిచ్చారు.

You missed